Breaking News

Madhya Pradesh: ఆస్పత్రిలో పేలిన ఏసీ.. వ్యాపించిన మంటలు

Published on Sun, 03/16/2025 - 09:22

గ్వాలియర్‌: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌(Gwalior)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఆస్పత్రిలో ఉన్నట్టుండి ఒక ఏసీ పేలిపోయింది. ఈ ఘటనలో ఆస్పత్రి అంతటా మంటలు వ్యాపించడంతో కలకలం చెలరేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోనికి తెచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

గ్వాలియర్‌ మున్సిపల్‌ కార్యాలయ అధికారి అతిబల్‌ సింగ్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఆస్పత్రి లేబర్‌ రూమ్‌(Labor room)లో మంటలు అంటుకున్నాయని తనకు సమాచారం రాగానే, తాను  ఈ విషయాన్ని ఫోనులో అగ్నిమాపకశాఖకు తెలియజేశానన్నారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారన్నారు. ఆస్పత్రిలోని ఏసీ పేలిపోయి, మంటలు అంటుకోగానే అప్రమత్తమైన సిబ్బంది అక్కడి రోగులను బయటకు తరలించారన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని తెలిపారు. గ్వాలియర్ సబ్‌ డివిజినల్‌ మేజిస్టేట్‌  వినోద్ సింగ్ మాట్లాడుతూ ఎయిర్ కండిషన్డ్ గైనకాలజీ యూనిట్‌లో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో అక్కడ దాదాపు 22 మంది ఉన్నారన్నారు. వైద్య సిబ్బంది అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించారన్నారు. 

ఇది కూడా చదవండి: 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ హతం?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)