Breaking News

Mahakumbh-2025: పెట్టుబడి పిసరంత.. ఆదాయం కొండంత.. ఏం ఐడియాలు గురూ!

Published on Sat, 02/08/2025 - 08:32

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 26 వరకూ ఈ పవిత్ర  ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా కోట్లాదిమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ  ఉత్సవం నేపధ్యంలో కొందరు రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిపోగా, మరోవైపు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్నారు.

టూత్ స్టిక్స్ విక్రయిస్తూ..
మహా కుంభమేళా(Kumbh Mela)లో కొందరు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్న ఉదంతానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. వీరిలో కొందరు టూత్ స్టిక్స్ విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తుండగా, మరికొందరు టీ విక్రయిస్తూ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇటీవల ఒక కుర్రాడు కుంభమేళాలో టూత్ స్టిక్స్ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆ కుర్రాడు ఈ ఐడియా తన గర్ల్‌ఫ్రెండ్‌ ఇచ్చిందని చెప్పాడు. టూత్ స్టిక్స్ అమ్ముతూ తాను రోజూ వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆ కుర్రాడు ఆ వీడియోలో తెలిపాడు.

టీ అమ్ముతూ రోజుకు రూ. 15 వేలు
మరోవ్యక్తి మహా కుంభ్‌లో టీ స్టాల్  ఏర్పాటు చేసుకుని టీ తోపాటు  భేల్ పూరి విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ కుర్రాడు తాను భేల్‌ పూరీలు తయారు చేస్తూ, టీ తయారు చేసే పనికోసం మరో కుర్రాడిని నియమించి, రోజుకు రూ. 15 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ఇలాంటి మరో వీడియోలో ఒక కుర్రాడు తన చేతిలో కెటిల్ పట్టుకుని కుంభమేళా ప్రాంతమంతా కలియతిరుగుతూ టీ విక్రయిస్తున్నాడు. తాను టీ విక్రయిస్తూ(Selling tea) రోజుకు ఎనిమిది నుంచి 10 వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు.

తిలకం దిద్దుతూ రోజుకు రూ. 20 వేలు
మహా కుంభమేళాకు వచ్చిన భక్తులకు తిలకం దిద్దతూ ఒక వ్యాపారి రోజుకు పది వేల నుంచి 20 వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడంటే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది నిజం.. ఆ వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం అతను తాను తిలకం దిద్దిన ఒక్కో వ్యక్తి నుంచి రూ. 10 చొప్పున వసూలు చేస్తున్నాడు. రోజుకు తాను రెండువేల మందికి తిలకం దిద్దుతున్నానని తెలిపాడు. ఈ మహా కుంభమేళా ముగిసేనాటికి తాను ఎనిమిది లక్షల రూపాయల వరకూ సంపాదించగలనని ఆ వ్యాపారి చెబుతున్నాడు.

నాణేలు ఏరుతూ రోజుకు రూ. 4 వేలు
కుంభమేళా వీడియోల్లో మరో వీడియో అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ వీడియోలో ఒక కుర్రాడు గంగానదిలో ఐస్కాంతం సాయంతో నాణేలను వెదుకుతున్నాడు. భక్తులు గంగానదిలో విసిరిన నాణేలను సేకరిస్తున్నట్లు ఆ కుర్రాడు చెప్పాడు. ఈ విధంగా తాను రోజుకు నాలుగు వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నట్లు తెలిపి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

ఇది కూడా చదవండి: Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)