Breaking News

Lok sabha elections 2024: దేశ గౌరవం ధ్వంసం: సోనియా

Published on Sun, 04/07/2024 - 04:59

జైపూర్‌:  దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు, బెదిరింపులతో ప్రతిపక్ష నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. గత పదేళ్ల ఎన్డీయే పాలనలో ఒరిగిందేమీ లేదని అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు.

నేడు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు విధ్వంసానికి గురవుతున్నాయని తెలిపారు. ఎన్డీయే పాలనలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనలను సహించే ప్రసక్తే లేదని, తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇది ప్రజలందరికీ చెందుతుందని పేర్కొన్నారు.    

‘గ్యారంటీ’ని దొంగిలించిన మోదీ: ఖర్గే  
అబద్ధాల నాయకుడు నరేంద్ర మోదీ అని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘గ్యారంటీ’ అనే పదాన్ని కాంగ్రెస్‌ నుంచి మోదీ దొంగిలించారని చెప్పారు. అవినీతిపరులు బీజేపీలో చేరగానే పరిశుద్ధులుగా మారిపోతున్నారని ప్రియాంకాగాంధీ వాద్రా ఎద్దేవా చేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)