Lok sabha elections 2024: మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో

Published on Tue, 05/28/2024 - 04:52

బక్తియార్‌పూర్‌/పాలీగంజ్‌/జగదీశ్‌పూర్‌(బిహార్‌): తాను సామాన్య వ్యక్తినికాదని, దేవుడు పంపించాడని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సోమవారం బిహార్‌లో బక్తియార్‌పూర్, పాలీగంజ్, జగదీశ్‌పూర్‌ల్లో ఆయన ప్రచార ర్యాలీల్లో మాట్లాడారు.

 ‘‘ఎన్నికల ఫలితాలొచ్చాక బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై మోదీని ఈడీ ప్రశ్నించొచ్చు. అప్పుడాయన ‘నాకేమీ తెలీదు. దేవుడు పంపిస్తే వచ్చా. ఆయన చెప్పినట్లే చేశా’’ అని చెబుతారేమో’’ అంటూ ఎద్దేవా చేశారు. బిలియనీర్లకు సేవ చేయడానికే దేవుడు ఆయన్ను పంపాడా అంటూ మండిపడ్డారు. 

పాలీగంజ్‌లో రాహుల్, ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మీసా భారతి సహా డజనుకు పైగా నేతలు కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుంగింది. దాంతో రాహుల్‌ కాస్త పక్కకు నడవగా అక్కడా కుంగింది. వారంతా కింద పడబోయి తమాయించుకున్నారు.

మోదీవి కూలదోసే కుట్రలు: ప్రియాంక
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ వద్రా ఆరోపించారు. కాంగ్రా సమీపంలోని చంబాలో ఆమె కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)