Breaking News

బిల్‌పై బాడీ షేమింగ్ వివాదం: స్పందించిన కెఫే

Published on Sat, 08/22/2026 - 15:48

బెంగళూరు:  బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కేఫ్‌లో ఆహారం ఆర్డర్ చేసిన తర్వాత పొందిన బిల్లును చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. బిల్లుపై అతడి పేరుకు బదులుగా "లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్" (పొట్టిగా, లావుగా ఉన్న నల్ల చొక్కా వ్యక్తి) అని రాయడం వివాదాస్పదమైంది. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న 'సుబ్‌కో ది క్రాఫ్టరీ' (Subko The Craftery) కేఫ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  

ఈ ఉదంతాన్ని బాధితుడు బిల్‌తో సహా రెడ్డిట్‌లో పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లను గుర్తు పట్టడానికి పేర్లు, టేబుల్ నంబర్లు లేదా ఆర్డర్ వివరాలు ఉపయోగించవచ్చు కానీ, ఇలా శరీర రూపాన్ని బట్టి గేలి చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన పేరు గానీ కనీసం టేబుల్ 12 వద్ద ఉన్న మనిషి అని కాకుండా, ఉద్దేశపూర్వకంగానే సిస్టమ్‌లో తనను బాడీ షేమింగ్‌ చేయడం బాధ పెట్టిందన్నారు. పురుషులపై జరిగే బాడీ షేమింగ్‌ను సాధారణ జోక్‌గా తీసిపారేయకూడదని సూచించాడు.

ఇదీ చదవండి: మూడేళ్ల నుంచే వేధింపులు, చివరికి 70 కిలోలు తగ్గింది, కానీ నరకం!

ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో కేఫ్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కస్టమర్ రూపాన్ని లేబుల్‌గా వాడటం అసభ్యకరమని నెటిజన్లు మండి పడ్డారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు,  గూగుల్ రివ్యూ రాయండి, తద్వారా మేనేజర్‌కు దీని గురించి తెలుస్తుంది. గుణ పాఠం నేర్చుకుంటారని ఒకరు, “ఓరి దేవుడా ఇది చాలా దారుణం! మీరు ఇలాంటి ఎదుర్కోవలసి వచ్చినందుకు క్షమించండి” అంటూ మరొకరు విమర్శించారు. 

ఇదీ చదవండి: పెళ్లిలో అనూహ్య పరిణామం : పెళ్లి దుస్తుల్లోనే వధువు చికిత్స

రెస్టారెంట్ క్షమాపణలు
వివాదం పెద్దది కావడంతో 'సుబ్‌కో కాఫీ రోస్టర్స్' ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పింది. ''ఫ్యాట్ షేమింగ్ అనేది ఏ రూపంలో ఉన్నా తప్పే. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవ''ని కేఫ్ స్పష్టం చేసింది. ఈ సమస్యను దాచకుండా బహిరంగంగానే తప్పును ఒప్పుకుంటున్నామని, తమ సంస్థలోని 'అంతర్గత ఫిర్యాదుల కమిటీ' (ICC) ద్వారా కస్టమర్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

ఇదీ చదవండి: 16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడు

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)