Breaking News

త్వరలో ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొవిజన్‌ బిల్లు

Published on Thu, 03/06/2025 - 05:44

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొవిజన్‌’ బిల్లును తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యట­నలో భాగంగా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారా­మన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియాతో సీఎం సమా­వేశం నిర్వ­హించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. 

ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలకు సంబంధించినవే అన్నారు. భూముల కంప్యూటరీకరణలో సరైన విధానం లేక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పా­రు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని.. అటవీ భూములను అధికారులతో కలి­సి ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్‌లో ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు విజయవంతంగా అమల­వుతోందని, దాని అమలును ఏపీలో కూడా అను­మతించాలని కోరినట్లు చెప్పారు. 

డీలిమిటేషన్‌ నిరంతర ప్రక్రియ
నియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ అని.. దీనిపై సమయానుకూలంగా స్పందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో జ­నా­భా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు జనాభాను పెంచాలనే విషయం అర్థమై పిలుపు­నిస్తున్నట్లు చెప్పారు.

పోలవరం 2027 కల్లా పూర్తి
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల బకాయిలను వదిలిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు.. సముద్రంలో కలిసే జలాలను వినియోగించుకుంటామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవ­రంను 2027 కల్లా పూర్తి చేస్తామని తెలి­పారు. 

189 కి.మీ. మేర అమరావతి ఔటర్‌
ఎనిమిది లైన్‌లతో 189 కి.మీ. మేర అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు.  శ్రీశైలం ఆలయం వద్ద ట్రాఫిక్‌ రద్దీని పరిష్కరించేందుకు రోడ్డును విస్తరించాలని, వినుకొండ–అమరా­వతి తదితర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. 

డీపీఆర్‌లు సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తా­మని గడ్కరీ చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తు­న్నాయన్నారు. మిర్చి క్వింటాకు రూ.11,781 మద్ద­తు ధర ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల సర్దుబాటుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)