Breaking News

కొత్త ముసుగులో ‘జంగిల్‌రాజ్‌’ 

Published on Sun, 10/19/2025 - 05:14

పట్నా:  బిహార్‌లో ‘జంగిల్‌రాజ్‌’కొత్త ముసుగు ధరించి మళ్లీ వచ్చిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సూచించారు. విపక్ష ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. ఆర్జేడీ పాలనలో అరాచక శక్తులు చెలరేగిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు అవే శక్తులు మరో రూపంలో వస్తున్నాయని దుయ్యబట్టారు. అప్పటి రాక్షస పాలన మళ్లీ రావడాన్ని ప్రజలు అంగీకరించబోరని తేల్చిచెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ‘ఇండియా’కూటమిని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. శనివారం బిహార్‌ రాజధాని పట్నాలో ఓ వార్తా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘బిహార్‌ సమాగం’లో అమిత్‌ షా మాట్లాడారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగాలంటే ఎన్డీయేను గెలిపించాలని చెప్పారు.   

బెంగాల్‌లో చొరబాటుదారులకు రెడ్‌ కార్పెట్‌  
బీజేపీ పాలిత అస్సాంలో అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు అమిత్‌ షా తెలిపారు. అస్సాం పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోకి చొరబాట్లు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ వలసదారులకు బెంగాల్‌ ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతోందని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగించడానికే ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ప్రారంభించినట్లు స్పష్టంచేశారు. ఎస్‌ఐఆర్‌ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. 

జమ్మూకశ్మీర్‌కు సరైన సమయలో రాష్ట్ర హోదా 
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే లద్దాఖ్‌ ప్రజల డిమాండ్లకు తగిన పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. ఆరి్టకల్‌ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగం పుంజుకుందని తెలిపారు. అక్కడ ప్రజాస్వామ్యం బలోపేతం అయ్యిందని స్పష్టంచేశారు.   
 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)