Breaking News

Lalbaugcha Raja: తొలిరోజే నిండిన హుండీలు.. భారీగా బంగారు, వెండి కానుకలు కూడా..

Published on Sat, 08/30/2025 - 08:22

ముంబై: దేశవ్యాప​ంగా గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గణపతి ఉత్సవాలను మహారాష్ట్ర పెట్టింది పేరు. ముఖ్యంగా ముంబైలో జరిగే గణనాథుని ఉత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతాయి. ఇక్కడి ‘లాల్‌బాగ్చా రాజా’ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. లక్షలాదిగా భక్తులు ఈ గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తూ నగదును, విలువైన కానుకలను అందిస్తున్నారు.
 

గణపతి నవరాత్రుల తొలిరోజునే లాల్‌ బాగ్చారాజాకు భారీగా విరాళాలు, కానుకలు అందాయి.  అలాగే బంగారం, వెండి కానుకలు కూడా గణనీయంగా వచ్చాయని లాల్‌బాగ్చా రాజా సార్వజనిక్ గణేశోత్సవ మండల్ నిర్వాహకులు తెలిపారు. స్టేజ్ హుండీ నుండి రూ. 25.50 లక్షలు, రంగ్ హుండీ ద్వారా మరో రూ. 20.50 లక్షలు విరాళాలుగా అందాయని, తొలిరోజున మొత్తం విరాళాలు రూ. 46 లక్షలని నిర్వాహకులు వివరించారు.  అలాగే పలువురు భక్తులు 144.050 గ్రాముల బంగారం, 7,159 గ్రాముల వెండిని  సమర్పించారని తెలిపారు.
 

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముంబైలో లాల్‌బాగ్చా రాజాను దర్శించుకునేందుకు వస్తుంటారు.  ఇక్కడ హృదయపూర్వకంగా ప్రార్థనలు చేసి, నగదు లేదా నగల రూపంలో విరాళాలు సమర్పిస్తుంటారు. ఈ విరాళాలను లెక్కించే ప్రక్రియ  ఉత్సవాల రెండవ రోజు నుండి ప్రారంభమవుతుంది.  ఉత్సవ నిర్వాహకుల పర్యవేక్షణలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జీఎస్‌ మహానగర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు విరాళాలను లెక్కిస్తారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)