ఎంబీబీఎస్‌ గైనకాలజీ పేపర్‌ లీక్‌?

Published on Wed, 08/05/2026 - 12:26

తిరువనంతపురం: కేరళ ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేయూహెచ్‌ఎస్‌) నిర్వహించిన ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ గైనకాలజీ ప్రశ్నపత్రం లీ​కయ్యిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. జూలై 31న జరిగిన ఈ పరీక్షలో మొత్తం 15 ప్రశ్నలకు గాను 6 ప్రశ్నలు, విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ముందుగానే అందుబాటులో ఉన్న మోడల్ ప్రశ్నాపత్రం నుంచి యథాతథంగా వచ్చినట్లు తేలింది. దీనివల్ల 24 మార్కులు (24 శాతం) మోడల్ పేపర్ నుంచే రావడంతో పరీక్ష విశ్వసనీయతపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆరు నాలుగు మార్కుల ప్రశ్నలు మోడల్ పేపర్‌లోని క్రమ సంఖ్యతో పాటు అచ్చం అలాగే పునరావృతం కావడం విశేషం. ప్రశ్నపత్రం రూపొందించిన అధ్యాపకుడికి, దానిని పరిశీలించిన పరిశీలకుడికి (స్క్రూటినీ) మోడల్ పేపర్ ముందే ఇచ్చినప్పటికీ ఈ పొరపాటును గుర్తించడంలో విఫలమయ్యారని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. విశ్వవిద్యాలయానికి విద్యార్థులు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. మరోవైపు ఆగస్టు 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ స్ట్రక్చర్డ్ క్లినికల్ నిర్వహణ విధానంపై కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల అనుసారమే పలు మార్పులు చేశామని విశ్వవిద్యాలయం సమర్థించుకుంది.

ఇది కూడా చదవండి: అత్యాచార ఆరోపణలు.. మూకదాడిలో యువకుడు మృతి

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)