Breaking News

ధోబీ ఘాట్‌లో కొరియన్‌ పిల్లల పనీ, పాటా : వైరల్‌ వీడియో

Published on Fri, 01/23/2026 - 15:20

పిల్లలు పెంపకంలో తల్లిదండ్రులకు కచ్చితంగా కొన్ని సూత్రాలను పాటించాలి. తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదనే ఉద్దేశంతో వాళ్లకి ఏ కష్టం తెలియకుండా,  అడిగిందల్లా క్షణాల్లో కళ్ల ముందర ఉంచుతూ, కాలు కందకుండా పెంచాలని భావిస్తుంటారు. నిజానికి ఈ విధానం వల్ల పిల్లల్లో సోమరితనం, కష్టపడి సాధించాలనే తపన సామర్థ్యం, తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయంటారు చైల్డ్‌ సైకియాట్రిస్టులు. అందుకే పిల్లలకు బాల్యం నుంచే శ్రమ విలువ, గౌరవం తెలిసేలా చేయాలి. ఒక విదేశీ మహిళ, తన బిడ్డలతో ఇలానే చేస్తోంది అంటే నమ్ముతారా? దీనికి సంబంధించి ఒక వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది.

‘వోనీ_బ్రదర్స్' అనే ఇన్‌స్టా ఖాతాలో  భారతీయ  పనిపద్ధతులు, జీవనశైలిని కొరియన్ కుటుంబానికి సంబంధించిన  ఒక ఆసక్తికరమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీని ప్రకారం వివిధ భారతీయ అనుభవాలు, ఆహారాలు,  లేదా ప్రయాణ విశేషాలు కాకుండా ఆ కుటుంబం తమ పిల్లలకు చేతులతో బట్టలు ఉతకడంలో ఉండే కష్టాన్ని చూపించాలని నిర్ణయించుకుంది. అలా ఇద్దరు చిన్న కొరియన్ పిల్లలు ముంబైలోని ప్రసిద్ధ ధోబీ ఘాట్‌కి  వచ్చి, మురికి బట్టలకు బండకేసి బాది ఉతికారు. తల్లి  కూడా దగ్గరే నిలబడి, వారితో పాటు బట్టలు ఉతకడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి ముందు అక్కడి  కార్మికులు బట్టలను శుభ్రం చేయడం, ఉతకడం లాంటి పనులను పిల్లలు  జాగ్రత్తగా  పరిశీలించడం విశేషం. "ధోబీ ఘాట్‌లో కొరియన్ పిల్లలు. నిజమైన భారతీయ జీవితాన్ని గడుపుతున్నారు. ధోబీ ఘాట్. నిజమైన పని, నిజమైన గౌరవం," అనే  క్యాప్షన్‌తో  షేర్‌ అయిన ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.

> ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల పెరోల్‌
కాగా వోనీ_బ్రదర్స్ భారతదేశంలో మొదటిసారిగా పానీ పూరీని ప్రయత్నించిన వీడియో వైరల్ అయింది. అలాగే ఈ బ్రదర్స్‌లో  ఒకరు సూపర్ సింగర్ జూనియర్ 9 పోటీదారు మైత్రేయన్‌తో కలిసి "కనిమా"అనే తమిళ పాటకు డాన్స్‌ చేస్తూ ఆన్‌లైన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించారు. దీనిపై  ఇది  కేవలం రీల్స్ కోసం చేసినట్లు అనిపించవచ్చు గానీ, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పే ఒక జీవిత పాఠం. దీనిని తేలికగా తీసుకోకూడదు," అని వ్యాఖ్యానించారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)