Breaking News

కోల్‌కతా ఉదంతం: ప్రభుత్వ అనుబంధ స్కూ‍ల్స్‌కు నోటీసులు

Published on Sun, 08/25/2024 - 12:28

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్‌  హాస్పిటల్‌లో జూనియర్‌ డాక్ట​ర్‌ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనను దేశం నలుమూలల నుంచి ప్రజలు, మెడికల్‌ కాలేజీ విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా ఖండించి పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఘటన జరిగిన పశ్చిమ బెంగాల్‌లో  మరింత అధికంగా చిన్నాపెద్ద తేడా లేకుండా నిరసనల్లో పాల్గొని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

అయితే తాజాగా బెంగాల్‌ ప్రభుత్వం పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పలు స్కూల్స్ టీచర్లు, విద్యార్థులతో నిరసనలు చేపట్టాయని పేర్కొంది. పాఠశాలలో విద్యార్థులకు క్లాసులు జరగాల్సిన సమయంలో ఇలా నిరసనల్లో వారిని పాల్గొనేలా చేయటంపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

హౌరా, బంకురా, తూర్పు మిడ్నాపూర్‌, పశ్చిమ మిడ్నాపూర్‌లోని పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్‌కు నోటీసులు ఇచ్చింది. అందులో హౌరాలోని బలుహతి ఉన్నత పాఠశాల, బలుహతి బాలికల ఉన్నత పాఠశాల, బంట్ర రాజలక్ష్మి బాలికల పాఠశాలు ఉన్నాయి. ‘‘ 23.08.2024న స్కూల్స్‌లో క్లాసులు జరగాల్సిన సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో.. నిరసన ర్యాలీ నిర్వహించినట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలా చేయటం సరికాదు.. బాలల హక్కుల ఉల్లంఘన’’ అని నోటీసుల్లో తెలిపింది.

ఇదిలా ఉండగా.. ఈ కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు  చేస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులకు  పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ చేసిన సీబీఐ.. ఇవాళ​ ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌కు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ చేయనున్నట్లు పేర్కొంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)