కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు బీజేపీ ఫోబియా

Published on Fri, 09/26/2025 - 00:59

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు బీజేపీ ఫోబి యా పట్టుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎంతో సహా ప్రతి ఒక్కరు బీజేపీపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతలు కలిసి పనిచేశారని, ప దవులు పంచుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వారు బీజేపీకి నీతులు, కథలు చెప్పాల్సిన పనిలేదన్నారు. 

కాశేళ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని సీబీఐ పరిశీలిస్తోందని, త్వర లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు అభివృద్ధి, విస్తరణ పనులపై ఆయనతో చర్చించారు. అనంతరం తన నివాసంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 26 ప్రాజెక్టులు డీపీఆర్‌ స్టేజ్‌లో ఉన్నాయని.. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఎప్పుడు ప్రాజెక్టులు పూర్తవుతాయనే వివరాలు వెల్లడిస్తామన్నారు.  

రేవంత్‌ వ్యవహారం సరిగాలేదు..  
‘మెట్రో విస్తరణ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని సమంజసంగా లేదు. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని, ప్రజలకు మేలు జరగాలని కోరుకునే వ్యక్తుల్లో ముందు వరుసలో నేనుంటాను. నేను కానీ, కేంద్రం కానీ మెట్రో రాకుండా అడ్డుకోవడం లేదు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, హైదరాబాద్‌ మెట్రో విషయంలో అందరికంటే ముందే మేం చురుగ్గా వ్యవహరించాం.

 ట్రిపుల్‌ ఆర్‌కు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. మెట్రో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తున్నప్పుడు చాలా విషయాలపై స్పష్టత కావాలని అడుగుతాయి. మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీన్ని వారే తేల్చుకోవాలి. మెట్రో విషయంలో అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది’అని కిషన్‌రెడ్డి తెలిపారు.  

రూ.30,425 కోట్లతో 1,174 కిలోమీటర్లకుపైగా జాతీయ రహదారులు  
‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఈ సంవత్సరం.. కొత్తగా 767 కిలోమీటర్ల మేర రూ.29,555 కోట్లు విలువైన వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టనుంది. దీనికి అదనంగా ఈ సంవత్సరం సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీఐఆర్‌ఎఫ్‌) కూడా మంజూరయ్యాయి. తెలంగాణలో 422 కిలోమీటర్ల సీఐఆర్‌ఎఫ్‌ రోడ్డుకు రూ.868 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయి. 

మొత్తం కలిపి 1,174 కిలోమీటర్లకు గానూ.. రూ.30,425 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు తెలంగాణలో ప్రారంభమవుతాయి. హైదరాబాద్‌–శ్రీశైలం రోడ్డు మార్గంలో భక్తులు, పర్యాటకుల సౌకర్యం కోసం.. 4లేన్‌ ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. హైదరాబాద్, కల్వకుర్తి మధ్యలో 4లేన్‌ కావాలని అడిగాం. దానిపై నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ చెప్పారు’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.  

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)