Breaking News

సిద్ధూ, డీకేలతో మాట్లాడతాం: ఖర్గే

Published on Thu, 11/27/2025 - 15:52

సాక్షి బెంగళూరు: కర్ణాటక సీఎం వివాదంపై ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. త్వరలోనే ఈ ప్రతిష్ఠంభనకు ముగింపు పలకబోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలోనే పార్టీ అగ్రనేతలతో కలిసి సమావేశం నిర్వహిస్తామని ఆ మీటింగ్‌లో ఈ వివాదానికి ముగింపు పలుకుతామని ఖర్గే పేర్కొన్నారు.

కర్ణాటకలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి కాపాడడం కోసం సిద్దరామయ్య, ఎలాగైనా సీఎం పదవి చేపట్టాలని డీకే శివకూమార్ ఇద్దరు నేతలు భీష్మించుకు కూర్చొన్నారు.  అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటీవల వ్యాఖ్యానించడంతో కేంద్రం ఆయనను సీఎం చేస్తానని హామి ఇచ్చిందని దానికోసమే అలా మాట్లాడారని అంతా అనుకున్నారు. ఈ వరుస ఘటనలతో   ఆ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారాయి. 

అయితే తాజాగా ఆ రాష్ట్ర వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ  "త్వరలోనే కర్ణాటకలో జరుగుతున్న వివాదానికి ముగింపు పలుకుతాం. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర నాయకులతో కలిసి సమావేశం నిర్వహిస్తాం. ఆ మీటింగ్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌ను కూడా పిలిచి వారితో చర్చిస్తాం" అని ఖర్గే తెలిపారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్‌ మాట్లాడుతూ మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్య అని అన్నారు. దీంతో సీఎం పదవినుద్దేశించే తాను మాట్లాడారని చర్చ జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా  ‘అంతిమంగా నిర్ణయం తీసుకునేది హైకమాండ్ఈ  గందరగోళానికి పూర్తి ముగింపు పలకడానికి, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి అని  అన్నారు

పవర్‌ షేరింగ్‌ ఏంటంటే..
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండనున్నట్లు అధిష్ఠానం నిర్ణయించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 తారీఖుతో రెండున్నరేళ్ల కాలం ముగిసింది. దీంతో సీఎం మార్పు వ్యవహారం మళ్లీ తెరమీదకొచ్చింది.

 

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)