Breaking News

ది కేరళ స్టోరీ.. బెంగాల్‌, తమిళనాడుకు సుప్రీం నోటీసులు

Published on Fri, 05/12/2023 - 15:46

ఢిల్లీ: ది కేరళ స్టోరీ.. ఈ సినిమాపై వివాదం కొనసాగుతున్నది. ఈ సినిమాను పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్‌ ఎందుకు చేశారని దేశ అ‍త్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో బెంగాల్‌, తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.

అయితే, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా నడుస్తోంది కదా? బెంగాల్‌ ఈ సినిమాను ఎందుకు నిషేధించాలి? అని ప్రశ్నించింది. బ్యాన్‌కు గల కారణాలను చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు ది కేరళ స్టోరీ బ్యాన్‌లో ఉన్న బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ది కేరళ స్టోరీ సినిమాను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్‌ చేయలేదు. లా అండ్ ఆర్డర్ ఆందోళనల కారణంగా థియేటర్ల యజమానులు సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో, తమిళనాడులో ఈ సినిమా విడుదల కాలేదు. 

ఇదిలా ఉండగా.. 'ది కేరళ స్టోరీ'ని నిషేధించిన మొదటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ సినిమాను బ్యాన్‌ చేసిన సందర్బంగా బెంగాల్‌ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు  హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అనంతరం, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ది కేరళ స్టోరీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "ది కేరళ స్టోరీ" అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీరియస్‌ అయ్యారు. 

మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లో సినిమాపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ‘ది కేరళ స్టోరీ’ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా సినిమాను ప్రదర్శించే థియేటర్లకు భద్రత కల్పించాలని మేకర్స్ స్టాలిన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

‘ది కేరళ స్టోరీ’ వివాదం ఇది..
వివాహానంతరం ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఐసిస్ క్యాంపులకు అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు మహిళలకు ఎదురైన కష్టాలను ‘ది కేరళ స్టోరీ’ వివరిస్తుంది. ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు. కేరళకు చెందిన 32,000 మంది మహిళలు తప్పిపోయి ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరారని ట్రైలర్‌లో పేర్కొనడంతో సినిమా చుట్టూ పెద్ద వివాదం చెలరేగింది.

ఇది కూడా చదవండి: కర్ణాటకలో ఖతర్నాక్‌ ఫైట్‌.. కౌన్‌బనేగా కన్నడ సీఎం

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)