అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
Breaking News
Kerala: ఎడతెగని వర్ష బీభత్సం.. విద్యా సంస్థలకు సెలవు
Published on Mon, 08/03/2026 - 07:47
తిరువనంతపురం: కేరళలో ఎడతెగని విధంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానల కారణంగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం కేరళలోని మొత్తం 14 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. భారీ వర్షాల ధాటికి పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా కాసరగోడ్, కన్నూర్, వాయనాడ్, పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం తదితర జిల్లాల్లోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగాలు సెలవు ప్రకటించాయి.
అలాగే ఆలప్పుళ జిల్లాలోని చెంగన్నూర్, కుట్టనాడ్ తాలూకాలు, ఎర్నాకులం పరిధిలోని విద్యాసంస్థలను మూసివేశారు. ఈ సెలవు పాఠశాలలు, వృత్తి విద్యా సంస్థలు, అంగన్వాడీలు, మతపరమైన విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుందని కలెక్టర్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గల్లంతు కాగా, 13 మంది గాయపడ్డారు. వరదలు, కొండచරلలు విరిగిపడటం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 27 ఇళ్లు పూర్తిగా, 196 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 209 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, 5,792 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిరాశ్రయులైన వారికి, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందిస్తుందని అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో వర్షాల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: మనిషి డీఎన్ఏలో అజ్ఞాత పూర్వీకుల ఆనవాళ్లు!
Tags : 1