Breaking News

పోక్సో కేసులో బెయిల్‌, బాలికపై కత్తితో దాడి, యువకుడి సాహసం

Published on Tue, 11/03/2026 - 18:51

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన వెలుగుచూసింది. పోక్సో (POCSO) కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఒక నిందితుడు, బాధితురాలైన బాలికపై హత్యాయత్నం చేయడం కలకలం రేపింది.సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసుల సమాచారం ప్రకారం అరక్కప్పాడి సమీపంలోని పెరుమని నివాసి మహమ్మద్ అద్నాన్‌. జైలు నుండి విడుదలైన కొన్ని వారాల తర్వాత, సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిందితుడు బాధిత బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశాడు. ఆమెను ఇంటి బయటకు ఈడ్చుకొచ్చి కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. బాలిక కేకలు విని పరుగెత్తుకొచ్చిన ఒక యువకుడు  వెంటనే స్పందించి,  నిందితుడిని అడ్డుకున్నాడు. దీంతో  ఆమెకు ప్రాణాపాయం తప్పింది.  ఈ పోరాటంలో ఆ యువకుడికి కత్తి గాయాలైనప్పటికీ, బాలిక ప్రాణాలను కాపాడ గలిగాడు. దాడి నుండి తనను తాను కాపాడుకునే క్రమంలో బాలిక రెండు చేతులకు గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.  నిందితుడిని  స్థానికుల సాయంలో అటవీ ప్రాంతంలో అరెస్టు చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచి మళ్లీ రిమాండ్‌కు తరలించారు.

ఆమెమెడ దగ్గర కత్తి పెట్టి, ఇంట్లోంచి బయటకు ఈడ్చుకు రావడం చూశాను. వెంటనే వెళ్లి అడ్డుకున్నాను.   ఈ క్రమంలో తనకూ గాయమైందనీ, కానీ బాలికను  కాపాడగలిగాను అని ఆ యువకుడు  ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

ఇదీ చదవండి: ఫస్ట్ ఏసీలోనే నగలు,నగదు చోరీ మహిళ ఆగ్రహం : స్పందించిన రైల్వే

కాగా ఈ ఏడాది ఆగస్టు  8న నిందితుడు అద్నాన్  పోక్సో కేసు నమోదైంది. నిందితుడు సుమారు రెండున్నర నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి, అక్టోబర్ 18న బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఇదీ చదవండి : ఏసీపీ మనస్వి వసిష్ఠ్‌పై సస్పెన్షన్ వేటు

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)