Breaking News

కేరళ విద్యార్థుల ఘనత...మొక్కల కోసం యాప్‌

Published on Sat, 02/14/2026 - 18:03

మీ స్కూల్‌ గ్రౌండ్‌లో ముక్కులున్నాయా? వాటి పేర్లేంటి? ఇంకా అక్కడ ఎలాంటి మొక్కలుంటే బాగుంటుంది? అక్కడ ఏయే మొక్కల ద్వారా ఏయే ప్రయోజనాలున్నాయి? వాటిని రక్షించుకోవడం ఎలా? ఇలాంటివి తెలుసుకునేందుకు కేరళలోని కార్యవట్టం ప్రభుత్వ కళాశాల బీఎస్సీ భౌగోళిక శాస్త్ర విద్యార్థుల బృందం ఓ వెబ్‌ అప్లికేషన్‌ను తయారు చేసింది. 

ఇది విద్యార్థులకు ఎంతో అనుకూలమైనది. సెకండరీ పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల క్యాంపస్‌లలో మొక్కల వైవిధ్యాన్ని మ్యాప్‌ చేసేందుకు ఈ యాప్‌ వీలు కల్పిస్తుంది. యాండ్రాయిడ్‌ ఫోన్‌ లేదా వెబ్‌ బ్రౌజర్‌ ఉంటే చాలు ఈ అప్లికేషన్‌ పనిచేస్తుంది. దీనికి ఇన్‌స్టాలేషన్‌ కూడా అవసరం లేదు. 

ఇదీ చదవండి: డ్యాన్సర్‌ నోట్లో బలవంతంగా నాణేలు : పరిస్థితి విషమం

ఈ యాప్‌ అందరూ వాడొచ్చు. సాధారణ ఫీల్డ్‌ సర్వేలను నిర్వహించడానికి ప్రాథమిక కార్టోగ్రాఫిక్‌ అంశాలతో జీవవైవిధ్య మ్యాప్‌లను తక్షణమే రూపొందించడానికి ఈ యాప్‌ పనికొస్తుందని దీన్ని తయారు చేసిన విద్యార్థులు అంటున్నారు. భౌగోళిక శాస్త్ర విభాగం అసిస్టెంట్‌   ప్రొఫెసర్‌ ప్రతీప్‌ కుమార్‌ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ రూపొందించారు. తరగతి గదుల్లో డిజిటల్‌ బోధనను  ప్రోత్సహించే కేరళ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (ఓఐఖీఉ) లక్ష్యాలకు అనుగుణంగా ఈ యాప్‌ తయారు చేశారు. టెక్నాలజీపై కనీస అవగాహన ఉన్న పాఠశాల విద్యార్థులంతా దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు.పాఠశాల విద్యార్థులలో డిజిటల్‌ విద్య, పర్యావరణ అభ్యాసం, జియోస్పేషియల్‌ నైపుణ్య అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఉపయోగ పడుతుంది. ఇలాంటి యాప్స్‌ తయారీపై విద్యార్థులు దృష్టి పెట్టాలి.

ఇదీ చదవండి: టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా?

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)