Breaking News

కాలకృత్యాలకు వెళ్లి.. మొసలి నోటికి చిక్కి..?

Published on Mon, 08/03/2026 - 13:58

కేంద్రపారా: ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టముండై బ్లాక్ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామంలో మొసలి దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. నదీతీర ప్రాంతాలలో పెరుగుతున్న మొసళ్ల ముప్పుపై స్థానికుల్లో ఆందోళన పెరిగింది. గతంలోనూ ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆధారాలున్నాయి.

మీడియాకు అందిన వివరాల ప్రకారం.. అళపువ పంచాయతీ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామానికి చెందిన సుచిత్రా దాస్ సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నదీతీరానికి వెళ్లారు. ఎంతకీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. నది ఒడ్డున ఆమెకు సంబంధించిన వస్తువులు లభించడంతో.. ఆమెను ఏదైనా మొసలి నీళ్లలోకి లాగికెళ్లి ఉంటుందనే తీవ్ర అనుమానం వ్యక్తమైంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుచిత్రా దాస్‌ ఆచూకీ కోసం బోట్లు, ప్రత్యేక పరికరాల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వంటమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సుచిత్రా దాస్‌.. తన కుటుంబ పోషణకు ఏకైక ఆధారం కావడంతో, ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కర్ణాటక మంత్రివర్గంలో కీలక మార్పులు.. కొత్త మంత్రులు వీరే!

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)