Breaking News

పుష్ప పాటకు సతీమణితో కేజ్రీవాల్‌ స్టెప్పులు

Published on Sat, 04/19/2025 - 08:13

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట శుభకార్యం జరిగింది. కేజ్రీవాల్‌ కూతురు హర్షిత తన ఐఐటీయన్‌ స్నేహితుడిని వివాహమాడారు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది రాజకీయ సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకలో కేజ్రీవాల్‌ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

ఢిల్లీలోని షాంగ్రీ లా ఎరోస్‌ హోటల్‌లో గురువారం కేజ్రీవాల్‌ కూతురి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియాలు హాజరయ్యారు. ఈ వేడుకలో పుష్ప 2 చిత్రంలోని ‘అంగారో కా అంబర్‌ సె’ పాటకు సతీమణి సునీతతో కలిసి కేజ్రీవాల్‌ హుషారుగా స్టెప్పులేశారు. 

జనాల గోల మధ్య కేజ్రీవాల్‌ వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యాయి. సుకుమార్‌ డైరెక్షన్‌లో పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌ దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ దక్కించుకున్నారో తెలియంది కాదు. ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు, ఆఖరికి పుష్ప మేనరిజం కూడా జనాలకు బాగా ఎక్కేసింది.   మరోవైపు.. వివాహ కార్యక్రమానికి హాజరైన పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కూడా పంజాబీ స్టైల్లో చిందులేసి ఆకట్టుకున్నారు. 

పీటీఐ కథనం ప్రకారం.. అరవింద్‌ కేజ్రీవాల్‌ కూతురు హర్షిత ఢిల్లీ ఐఐటీలో చదివారు. కాలేజీ రోజుల్లో స్నేహితుడైన సంభవ్‌ జైన్‌ ఇష్టపడి వివాహమాడారు. ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి బసిల్‌ హెల్త్‌ అనే స్టార్టప్‌ను కూడా నడిపిస్తున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో కపుర్తలా హౌజ్‌లో వీళ్ల వివాహం జరిగింది. ఈ వేడుకకు కొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఏప్రిల్‌ 20వ తేదీన రిసెప్షన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)