Breaking News

షాకింగ్‌ జిప్‌లైన్ రైడ్‌ ప్రమాదం, 40 అడుగుల ఎత్తునుంచి..!

Published on Mon, 07/20/2026 - 13:01

సాక్షి, బెంగళూరు:  కర్ణాటకలోని దాండేలి (Dandeli) రిసార్ట్‌లో  జరిగిన ఒక జిప్‌లైన్ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. అడ్వెంచర్ రైడ్ కోసం వెళ్లిన ఒక పర్యాటకుడు, భద్రతా లోపాల కారణంగా దాదాపు 40 అడుగుల ఎత్తు నుండి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అడ్వెంచర్ టూరిజం కేంద్రాలలో భద్రతా ప్రమాణాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రమాదానికి గురైన వ్యక్తిని కర్ణాటకలోని విజయపురకు చెందిన కుబేర్ సుర్పుర్ గా గుర్తించారు.  కుబేర్ గాల్లో జిప్‌లైన్‌పై వెళ్తుండగా, దానికి సంబంధించిన సేఫ్టీ లాక్ (Safety Lock) ఊడిపోవడంతో ఆయన నేరుగా కిందపడిపోయారు. దాదాపు 40 అడుగుల ఎత్తు నుండి పడటంతో కుబేర్ చేతులు, కాళ్లు విరిగిపోయాయి. అలాగే నరాలు కూడా దెబ్బతిన్నాయి.

రిసార్ట్ యాజమాన్యంపై ఆరోపణలు
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో  తీవ్ర ఆందోళన చెలరేగింది. రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైడ్‌కు ఉపయోగించిన పరికరాలు తుప్పు పట్టి పోయాయని, వాటిని సరిగ్గా నిర్వహించలేదని  వారు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి ఆలయంలో బర్త్‌డే ప్రత్యేక పూజలు చేసిన నటి


 

మరోవైపు  ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడు కుబేర్‌ను మొదట దాండేలి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత విజయపుర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన, నిపుణులైన వైద్యం కోసం ఆయనను మిరాజ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అడ్వెంచర్ స్పోర్ట్స్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్‌ ఝలక్‌ : కారణం ఇదే!

నెటిజన్ల కామెంట్స్
ఇది చాలా ఘోరమైన జిప్‌లైన్ డిజైన్. చేతులు వదిలేసినా కింద పడకుండా బెల్ట్స్‌ శరీరానికి గట్టిగా అమర్చాలి కదా. ఇలాంటి వాటికి అసలు అనుమతులు ఎలా ఇస్తారు?! అని ఒకరు  తీవ్రంగా మండిపడ్డారు.  యాజమాన్యానికి ఏదో కొద్దిపాటి జరిమానా విధిస్తారు, కొన్ని రోజులు రిసార్ట్ మూసివేసి మళ్లీ తెరుస్తారు. బాధితులకేమీన్యాయం జరగదు అంతా యథావిధిగా జరిగిపోతుంది అంటూ మరొకరు అసహనం వ్యక్తం చేశారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)