Breaking News

రూ. 5 లక్షలు ఖర్చుపెట్టి.. విద్యార్థులను ఫ్లైట్‌ ఎ‍క్కించిన హెడ్మాస్టర్‌

Published on Wed, 12/31/2025 - 19:35

బెంగళూరు: బాల్యంలో ప్రతీ ఒక్కరి జీవితాల్లో ఉపాధ్యాయుల  ప్రేరణ చాలా ఉంటుంది. తల్లి దండ్రుల తరువాత పిల్లలపై తమ ప్రేమ అప్యాయతలను కురిపించేది టీచర్లు మాత్రమే. అందుకే గొప్ప గొప్ప నాయకులు, సెలబ్రిటీల జీవితాలపై టీచర్ల ప్రభావం ఉంటుంది. తాజాగా కర్ణాటకలోని కొప్పల్ జిల్లా బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యుడి చేసిన పని నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది.

విమానం ఎక్కాలనే విద్యార్థులకలను సాకారం చేసేందుకు కర్ణాటకకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు దాతృత్వాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలిచింది. బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీరప్ప అందగి 24 మంది విద్యార్థులను తొలి సారి  విమానం  ఎక్కించారు. తన సొంత ఖర్చులతో రూ. 5 లక్షలు  వెచ్చించి మరీ తన విద్యార్థులను లైఫ్‌లో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చారు. 5-8 తరగతుల విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది, పాఠశాల అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులు మొత్తం 40 మంది విమానంలో ప్రయాణించారు. వీరి కోసం తోరణగల్లులోని జిందాల్ విమానాశ్రయం నుండి బెంగళూరుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.ప్రతీ క్లాస్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన తొలి ఆరుగుర్ని ఈ జర్నీకి ఎంపిక చేశారు.

 కొప్పల్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఇరవై నాలుగు మంది విద్యార్థులు తమ తొలివిమాన ప్రయాణాన్ని అనుభవించారు, వారి  ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి సంతోషం పడే  వారు తొలిసారి విమానం ఎక్కి తెగ సంతోష పడిపోయారు. బెంగళూరులో రెండు  రోజులు ఉండి అనేక పర్యాటక ప్రదేశాలను, పాఠశాలలను సందర్శించి  తమ అభిమాన హెడ్మాస్టర్‌కి శతకోటి అభివందనాలు కొప్పల్‌కు తిరిగొచ్చారు. ఎన్నో మధురమైన,సంతోషకరమైన క్షణాలను, అనుభవాలను మూటగట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగామారింది. ఆయనపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఇదీ  చదవండి: నాకు వేరే దారి లేదు! మమ్మా యూ ఆర్‌ ద బెస్ట్‌.. సారీ!

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)