Breaking News

‘సీఎంగా ఇంకెన్ని రోజులు ఉంటానో తెలియదు’

Published on Thu, 11/20/2025 - 14:45

కొంతకాలంగా కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. పవర్‌ షేరింగ్‌ ఫార్ములా తెర మీదకు రావడం.. తన తండ్రి రాజకీయ భవిష్యత్తుపై సీఎం సిద్ధరామయ్య కొడుకు చేసిన వ్యాఖ్యలు.. అటుపై రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలన పూర్తి కావడంతో నవంబరులో నాయకత్వ మార్పు (Karnataka CM) తథ్యమని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో.. 

రాష్ట్రంలో పవర్‌ పాలిటిక్స్‌పై కర్ణాటక బీజేపీ యూనిట్‌ వ్యంగ్యంగా స్పందిస్తోంది. మొన్నీమధ్యే.. నవంబర్‌ వచ్చినా డీకేకు సీఎం సీటు మాత్రం దక్కలేదని పేర్కొంటూ ఏఐ ఫన్నీ (BJPs AI video) ఏఐ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తాజాగా సీఎం సిద్ధరామయ్యను ఉద్దేశించి మరో వీడియోను పోస్ట్‌ చేసింది. అందులో.. సిద్ధరామయ్య ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఉంటారు. సీఎంగా రెండున్నరేళ్ల పాలన పూర్తైందని.. సీఎంగా ఇంకా ఎంత కాలం కొనసాగుతానో తెలియదని.. అందుకే మీ ముందుకు వచ్చానని అంటారు. ఈలోపు.. 

కింద కామెంట్‌ సెక్షన్‌లో అజ్మల్‌, జమాల్‌, రఫీక్‌, ఫైజ్‌.. అనే యూజర్లు ‘ఐదేళ్లు మీరే సీఎంగా ఉండాలి’ అంటూ కామెంట్‌ పెడతారు. అయితే శంకర్‌ కనకపుర అనే వ్యక్తి మాత్రం.. ‘ఇంకెంత కాలం సీఎంగా ఉంటారు. రాజీనామా చేసి దిగిపోండి’ అని కామెంట్‌ చేస్తాడు. దీంతో అగ్గి మీద గుగ్గిలం అయిన సిద్ధరామయ్య.. ఎవరా వ్యక్తి.. అతన్ని బ్లాక్‌ చేస్తా అంటాడు. రెండు వర్గాలను ఉద్దేశించేలా.. కాంగ్రెస్‌ సర్కార్‌పై బీజేపీ చేసిన ఈ సెటైరిక్‌ ఈ వీడియో ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. 

నాయకత్వ మార్పు నేపథ్యంతో అంతకు ముందు బీజేపీ ఏఐ ఆధారిత వీడియోలో డీకే శివకుమార్‌ని టార్గెట్‌ చేసింది. అందులో.. రాహుల్ గాంధీ వాట్సాప్‌లో హాయ్‌ అనే మెసేజ్‌ పంపిస్తారు. ఆ సమయంలో రాహుల్‌ పక్కన సిద్ధరామయ్య కూడా ఉంటారు. ఆ తర్వాత  స్క్రాచ్‌ కార్డు పంపుతారు. డీకే దానిని స్క్రాచ్‌ చేయగా..‘నో ఛైర్‌ నవంబర్‌’ (No Chair November) అనే మెసేజ్‌ చూసి షాక్‌ అవుతాడు. మరోవైపు రాహుల్‌ గాంధీ, సిద్ధరామయ్య కూడా నవ్వుకుంటారు. అనంతరం స్క్రీన్‌పై హస్కీ డ్యాన్స్‌ను దీనికి జోడించారు. బీజేపీ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. శివకుమార్‌కు ఇది కుర్చీలేని నవంబర్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది.  

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)