Breaking News

కర్ణాటక గవర్నర్‌ పంతం.. ‘సుప్రీం’కు సిద్ధరామయ్య సర్కార్‌!

Published on Thu, 01/22/2026 - 07:55

కర్ణాటక గవర్నర్‌ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. గురువారం నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రసంగించకూడదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తనకు సమర్పించిన గవర్నర్‌ ప్రసంగం కాపీలో అభ్యంతరాల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడింది.

గవర్నర్‌ ప్రసంగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు.. గత ఏడాది పని తీరును ప్రతిబింబించే అధికారిక ప్రకటన.  ఏ రాష్ట్రంలోనైనా సరే శాసనసభ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతోనే ప్రారంభం కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 176 ఈ విషయాన్నే స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ.. గవర్నర్‌ ప్రారంభోపన్యాసం ఇవ్వకపోతే శాసనసభ ప్రారంభం జరగదు!. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియలో అంతరాయం కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మార్గం ఉంది.

గవర్నర్‌ గనుక ప్రసంగం ఇవ్వనని చెబితే.. ఆ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌ను ఆశ్రయించవచ్చు. ఇవాళ జరగబోయే ఉమ్మడి శాసనసభ సమావేశంలో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లోట్‌(Thawar Chand Gehlot) ప్రసంగం ఇవ్వకపోతే.. సిద్ధరామయ్య ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గవర్నర్‌ అభ్యంతరాలివే.. 
ఈ వివాదానికి మూలం గవర్నర్‌ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చిన కొన్ని పేరాలు. ముఖ్యంగా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ (MGNREGA) రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని విమర్శించడం, కర్ణాటకకు నిధుల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు ఉండడం. థావర్ చంద్ గెహ్లాట్ వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తొలగించాలని కోరారు. తొలగించకపోతే ప్రసంగం ఇవ్వబోనని లోక్‌భవన్‌ వర్గాల ద్వారా ప్రభుత్వానికి కబురు పంపారు.

గవర్నర్‌ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమే. గవర్నర్‌ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పే వేదిక కాదు. ప్రసంగం ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ అంశం మీదే సుప్రీం కోర్టులో వాదనలు జరిగే చాన్స్‌ ఉంది.

కోర్టు ఏం చెప్పిందంటే..
గతంలో గవర్నర్లు ప్రసంగాలు చదవకపోవడం.. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం లాంటి ఘటనలు జరిగాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2023లో అప్పటి కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మొహమ్మద్‌ ప్రసంగం మొత్తం చదవకుండా మధ్యలో వెళ్లిపోయారు. ఆ సమయంలో పినరయి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే.. ప్రసంగం మొత్తం చదవడం గవర్నర్‌కున్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని ఆ టైంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2024-2025 మధ్యకాలంలో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కూడా ఇలా మూడుసార్లు చేశారు. ఆ సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గవర్నర్‌ ప్రసంగం తప్పనిసరి.. అది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమేనని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో గవర్నర్‌–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తోంది. మొన్న తమిళనాడు, నిన్న కేరళలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి.

సభ ఆగిపోతుందా?.. 
రకరకాల కారణాలతో.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసానికి దూరం కావడం, లేదంటే మధ్యలో వెళ్లిపోవడం లాంటి పనులు గవర్నర్లు చేసిన సందర్భాలు భారత దేశ చరిత్రలోనే అనేకం ఉన్నాయి. అయితే.. గవర్నర్‌ ప్రసంగం ఇవ్వకపోయినా సరే ప్రభుత్వం తాను సిద్ధం చేసిన ప్రసంగాన్ని అధికారికంగా రికార్డులోకి తీసుకుని సమావేశాలను నిర్వహించుకోవచ్చు. తద్వారా రాజ్యాంగ ప్రక్రియ కొనసాగుతుంది. గవర్నర్‌ ప్రసంగం అనేది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యతేకాని సభ ఆగిపోయేంత కారణం కాదన్నమాట. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)