Breaking News

రేటు అడిగితే దారుణంగా దాడి : ఏకంగా వేళ్లు నరికేశారు!

Published on Mon, 10/27/2025 - 16:26

స్వల్ప వివాదానికే 22 ఏళ్ల  లా విద్యార్థిపై  దాడిచేసిన ఘటన  కలకలం  రేపింది. మందుల ధర గురించి ప్రారంభమైన వాదన, తీవ్ర ఘర్షణకు దారితీసింది. ప్రస్తుతం బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చిక్సిత పొందుతున్నాడు. ఆ విద్యార్థి తలకు 14 కుట్లు వేయాల్సి వచ్చిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాన్పూర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాన్పూర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం లా చదువుతున్న అభిజీత్ సింగ్ చందేల్ స్థానిక మెడికల్ షాపుకు వెళ్లాడు. అక్కడ మందుల ధర గురించి సిబ్బంది అమర్ సింగ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇది తీవ్రం కావడంతో విచక్షణ మరిచిన  అమర్ సింగ్‌ దాడికి దిగాడు. ఇతనికి సోదరులు విజయ్ సింగ్, స్నేహితులు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖిల్ కూడా  తోడయ్యారు.  తలపై బలంగా కొట్టడంతో రక్తమోడుతున్నా, ప్రాణభయంతో పరుగు పెడుతున్నా బాధితుడిని  వదలి పెట్ట లేదు. నలుగురూ కలిసి అభిజీత్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు అతని కడుపును పదునైన ఆయుధంతో కోసి, చేతి వేళ్లను నరికేశారు. 

చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?

అభిజీత్‌ గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.   పొట్టలోని పేగులు  బైటకు వచ్చేశాయి. వాటిని గుడ్డలో చుట్టి మరీ ఆస్పత్రికి తరలించారు. 

మరోవైపు నిందితులకు పలుకుబడి ఉన్న  నేపథ్యంలో చావు బతుకుల్లో ఉన్న తన కొడుకుపై, తనపైనా అక్రమ కేసు బనాయించారని చందేల్‌ తల్లి నీలం సింగ్ చందేల్‌ వాపోయారు. 

అయితే  చౌహాన్ ఫిర్యాదు ఆధారంగా చందేల్‌పై దోపిడీ కేసు నమోదు చేశామని, కానీ దాడి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. చౌహాన్, సింగ్ , తివారీలను హత్యాయత్నం ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ఏసీపీ కుమార్ ధృవీకరించారు. నాల్గవ నిందితుడు ప్రిన్స్ శ్రీవాస్తవ పరారీలో ఉన్నాడని  అతని కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.  బాధితుడు తలకు 14 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీచదవండి శివసేన నేతతో నటి ఎంగేజ్‌మెంట్‌ : ఫోటోలు వైరల్‌

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)