Breaking News

క్షమాపణలు చెప్పను: కమల్‌ హాసన్‌

Published on Thu, 05/29/2025 - 08:38

కన్నడ భాష వివాదం నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోనంటూ స్పష్టం చేశారాయన. బుధవారం థగ్‌ లైఫ్‌ ఈవెంట్‌లో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో తనను విమర్శించిన నేతలకూ ఆయన చురకలంటించారు. 

‘‘ఈ ఇష్యూపై గందరగోళం నెలకొంది. అందుకే స్పష్టత ఇవ్వదల్చుకున్నా. చాలామంది చరిత్రకారులు(రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ..) నాకు భాష చరిత్ర గురించి పాఠాలు బోధిస్తున్నారు. కానీ, నాతో సహా రాజకీయ నాయకులెవరికీ భాష వ్యవహారంపై మాట్లాడే అర్హత లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. తమిళంతో పాటు మీనన్‌, రెడ్డి, అయ్యంగార్‌ ముఖ్యమంత్రులయ్యారు. 

చాలా కాలం కిందట కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడుకు సీఎం అయిన వ్యక్తి నుంచి నాకు సమస్య ఎదురైంది. ఆ సమయంలో కర్ణాటక నాకు మద్దతు ఇచ్చింది. ఎక్కడికీ వెళ్లొద్దు.. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోండి అంటూ కన్నడ ప్రజలు ప్రేమ చూపించారు. కాబట్టి ఇప్పుడు కూడా థగ్‌ లైఫ్‌, కమల్‌ హాసన్‌ను ప్రజలే చూసుకుంటారు.

భాషా వ్యవహారం చాలా లోతైన అంశం. నాతో సహా ఏ రాజకీయ నాయకుడికి దాని గురించి మాట్లాడే అర్హత లేదు. కాబట్టి ఈ చర్చను భాషా నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్లకు వదిలేయండి. శివన్న, ఆయన తండ్రి మీద ప్రేమతో ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడిందే తప్ప అందులో మరే ఉద్దేశం లేదు. ప్రేమతోనే మాట్లాడినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా.  కాబట్టి ఆ పని చేయను’’ అని కమల్‌ అన్నారు. 

ఇటీవల చెన్నైలో తన చిత్రం థగ్‌ లైఫ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని శివరాజ్‌ కుమార్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కన్నడ సంఘాల నాయకులు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. ‘కన్నడ- కస్తూరి’ అనే విషయాన్ని ఆ నటుడు మర్చిపోయినట్లు ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. రెండున్నర వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భాషను కమల్‌ మర్చిపోయినట్లు ఉందని సీనియరు నటుడు జగ్గేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్‌ నటించిన ‘థగ్‌ లైఫ్‌’ చిత్ర ప్రదర్శనను కర్ణాటకలో అడ్డుకుంటామని వివిధ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆయనపై నిషేధం విధిస్తామని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ   తదితరులు కమల్‌ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు