Breaking News

బిగ్‌బాస్ ఫేమ్ దివ్యపై హిట్ అండ్ రన్ కేసు.. ఏం జరిగిందంటే?

Published on Sat, 10/25/2025 - 08:22

సాక్షి, యశవంతపుర: బిగ్‌బాస్‌ అనగానే వివాదాలు, గొడవలు గుర్తుకువస్తాయి. అదే మాదిరిగా బుల్లితెర నటి, గతంలో బిగ్‌బాస్‌–8 పోటీదారు దివ్య సురేశ్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో చిక్కుకుంది. బైక్‌ను ఢీకొనడంతో ఓ యువతి కాలు విరిగినట్లు తెలిసింది. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్‌ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల నాలుగో తేదీ అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బెంగళూరు బ్యాటరాయనపుర ఎంఎం రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కిరణ్, అనుషా, అనిత కలిసి బైకులో ఆస్పత్రికి వెళుతున్నారు. కుక్కలు అడ్డురావటంతో భయంతో కిరణ్‌ బైకును కొద్దిగా కుడివైపు తిప్పాడు. అదే సమయంలో వెనుక వేగంగా వస్తున్న దివ్య సురేశ్‌ కారు.. వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కింద పడ్డారు. అనిత కాలికు దెబ్బ తగిలింది. అయినా కూడా దివ్య కారు ఆపి ఏమైందో తెలుసుకోకుండా అలాగే ఉడాయించింది.  

రూ.2 లక్షలు ఖర్చయింది   
ఈ క్రమంలో కిరణ్‌ ఏడో తేదీన కారు హిట్‌ అండ్‌ రన్‌పై బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం, పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అది దివ్య సురేశ్‌ కారుగా గుర్తించారు. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్‌ చేశారు. అనిత కాలు ఫ్రాక్చర్‌ కావడంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్సగానూ రూ. 2లక్షలు ఖర్చయినట్లు, తమకు న్యాయం చేయాలని కిరణ్‌ ఫిర్యాదులో కోరాడు.     

 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)