రావణునికి కంగన నిప్పు.. చరిత్రలో తొలిసారి!

Published on Tue, 10/24/2023 - 10:30

దేశవ్యాప్తంగా విజయ దశమి‍  వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయ దశమి రోజున పలు ‍ప్రాంతాల్లో రావణుని దిష్టిబొమ్మను దహనం చేసి, చెడుపై మంచి విజయం సాధించిందనే సందేశాన్ని అందిస్తారు. రావణ దహన వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగే ‘లవకుశ రామ్‌లీల’ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈసారి విజయ దశమి వేడుకల్లో ఓ మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయనుంది. ఇది రామ్‌లీల చరిత్రలో కొత్త అధ్యాయమని పలువురు చెబుతున్నారు. 

లవకుశ రామ్‌లీలలో రావణుని దహనం చేసేది మరెవరో కాదు నటి కంగనా రనౌత్. కంగన తదుపరి చిత్రం తేజస్‌పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కంగనా రనౌత్ ఢిల్లీలోని లవకుశ రామ్‌లీలలో రావణ దహనానికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియోలో కంగనా రనౌత్ తాను రావణ దహనం చేయడానికి ఢిల్లీకి వస్తున్నట్లు తెలిపారు. 

ఈ వీడియోలో నటి తన తేజస్‌ సినిమాను కూడా ప్రమోట్ చేశారు. ‘ఎర్రకోటలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమ 50 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయడం ఇదే మొదటిసారి. జై శ్రీరామ్’ అని కంగన క్యాప్షన్‌లో రాశారు. కంగనా రనౌత్‌కి పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కంగన రనౌత్ నటించిన తేజస్ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. 
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)