Breaking News

బెట్టింగ్‌ యాప్స్‌ స్మోకింగ్‌ కన్నా డేంజర్‌: కేఏ పాల్‌

Published on Fri, 05/23/2025 - 16:16

సాక్షి, న్యూఢిల్లీ: బెట్టింగ్‌ యాప్స్‌ వల్ల ఇప్పటికే వేల మంది చనిపోయారని, ఇకనైనా ఆ తరహా మరణాలు సంభవించకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కోరుకుంటున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌(Betting Apps) వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌కే సింగ్‌ బెంచ్‌ విచారించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేసింది. 

ఈ పరిణామంపై కేఏ పాల్‌(KA Paul) మీడియాతో మాట్లాడారు. ‘‘బెట్టింగ్ యాప్స్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.అవసరమైతే రాష్ట్రాలకు కూడా నోటీసులు పంపిస్తామని పేర్కొంది. బెట్టింగ్ యాప్‌ల వల్ల ఇప్పటికే వేల మంది చనిపోయారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని? ప్రశ్నిస్తూ సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది.. 

.. సిగరెట్ త్రాగితే హానికరం అని ఉంటుంది. స్మోకింగ్ కంటే మిలియన్ టైమ్స్ డేంజర్‌.. బెట్టింగ్ యాప్స్. దాదాపు 1,100 లకు పైగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ కోసం ప్రమోషన్ చేస్తున్నారు. బదులుగా కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల భవిష్యత్ లో ఆత్మహత్యలు జరక్కుండా చూడాల్సిన అవసరం ఉంది. మనీల్యాండరింగ్‌ జరగకుండా ఉండాలంటే.. బెట్టింగ్ యాప్ లను నిషేధించేలా కేంద్రం(Centre) చట్టం తీసుకురావాలి అని కేఏ పాల్‌ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: అద్భుతమైన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు