Breaking News

12 టీబీ డాటా డిలీట్‌ చేసి.. ఐఎస్‌ఐ‌ ఏజెంట్లతో ముచ్చట్లు

Published on Tue, 05/27/2025 - 15:56

పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా కేసులో.. తాజాగా షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. పాక్‌ నిఘా సంస్థ.. కరడుగట్టిన ఐఎస్‌ఐ(Inter-Services Intelligence) అధికారులతో ఆమె నేరుగా పరిచయాలు కలిగి ఉందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) ఏమాత్రం భయం లేకుండా వాళ్లతో పరిచయాలు పెంచుకుంది. ఒకరి తర్వాత మరొకరితో మాట్లాడింది కూడా. ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌ సందర్శన సందర్భంగా ఆమె వాళ్లను కలిసినట్లు తెలుస్తోంది. అయితే  ఐఎస్‌ఐలో వాళ్లు ఏం పని చేసేవాళ్లో కనుగొనే పనిలో దర్యాప్తు అధికారులు తలమునకలయ్యారు. అంతకు ముందు..

జ్యోతి వ్యక్తిగత డివైజ్‌లను(ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌) పోలీసులు సీజ్‌ చేశారు. ఆ డివైజ్‌ల్లో భారీగా మెసేజ్‌లు, డాటా డిలీట్‌ అయినట్లు గుర్తించారు. ఆ డిలీట్‌ డాటానే సుమారు 12 టీబీ(12 terabyte) దాకా ఉండొచ్చని తెలుస్తోంది.  అందులోని సమాచారం ఈ కేసుకు ఉపకరించే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు రికవరీకి ప్రయత్నిస్తున్నారు. 

పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్‌ సింధూర్‌(Operation Sindoor) పేరిట భారత సైన్యం పాక్‌ భూభాగంతో పాటు పీవోకేలో వైమానిక దాడులు జరిపింది. ఆపై వారానికి(మే 15వ తేదీన ) యూట్యూబ్‌లో ట్రావెల్‌ వ్లోగింగ్‌ చానెల్‌ నడిపించే జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్‌ చేశారు.  పాక్‌కు గూఢచర్యం జరిపి ఉంటుందనే అనుమానిస్తున్నారు. పాక్‌, చైనాలో పర్యటనలతో పాటు పాక్‌లో జరిగిన హైప్రొఫైల్‌ ఈవెంట్లకు ఆమె హాజరు కావడం, కేవలం 4 లక్షల ఫాలోవర్స్‌ ఉన్న ఆమె విచ్చలవిడిగా అక్కడ ఖర్చులు చేయడం, అలాగే గన్‌మెన్లతో వీవీఐపీ ట్రీట్‌మెంట్‌ పొందిందన్న విషయం వెలుగులోకి రావడంపై దర్యాప్తు జరుగుతోంది. 

ప్రస్తుతానికి.. అఫీషియల్స్‌ సీక్రెట్స్‌ యాక్ట్‌, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఆమెపై హర్యానా పోలీసులు కేసులు నమోదు చేశారు. పాక్‌లో ఆమె అసలు వీఐపీ ట్రీట్‌మెంట్‌ ఎందుకు పొందింది? ఎలా పొందగలిగింది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే.. డిలీట్‌ చేసిన డాటాలో గనుక కీలక సమాచారం ఉన్నట్లయితే ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. ఆమె ఆర్థిక లావాదేవీలపై విచారణ కోసం పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థల సాయం కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: విదేశీ భార్యల మోజు వద్దు!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)