Breaking News

Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు బిగ్‌ షాక్‌!

Published on Wed, 06/04/2025 - 07:31

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అధికారిక భవనం ఔట్‌హౌస్‌లో సగం కాలిన స్థితిలో కరెన్సీ కట్టలు వెలుగుచూసిన ఘటనలో అప్రతిష్టను మూటగట్టుకున్న అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ(Justice Yashwant Varma)ను అభిశంసించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో జరగబోయే పార్లమెంట్‌ సమవేశాల్లో ఈమేరకు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 

తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడేందుకు వీలుగా అన్ని ప్రధాన రాజకీయ పక్షాల నేతల సమ్మతిని సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు త్వరలో సమావేశంకానున్నారని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ముగ్గురు జడ్జీల విచారణ కమిటీ సైతం జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు వ్యతిరేకంగా నివేదికను రూపొందించిన నేపథ్యంలో ప్రభుత్వం అభిశంసనకు(Impeachment) రంగం సిద్ధంచేస్తోంది. 

ఘటన వెలుగుచూసిన కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అనాడే జస్టిస్‌ యశ్వంత్‌ను రాజీనామా చేయాలని మౌఖికంగా కోరినా అందుకు ఆయన నిరాకరించినట్లు వార్తలొచ్చాయి. ఈ ఉదంతం తర్వాతే రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు సీజేఐ హోదాలో జస్టిస్‌ ఖన్నా ఒక సిఫార్సు లేఖ రాశారు. జస్టిస్‌ యశ్వంత్‌ను అభిశంసించాల్సిందేనని ఆయన సిఫార్సుచేశారు. 

జూలై మూడోవారంలో మొదలయ్యే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో(Parliament Monsoon Session) ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే వీలుంది. లోక్‌సభలో, తర్వాత రాజ్యసభలో ఈ తీర్మానాన్ని తీసుకొస్తారు. ఎంపీల్లో మూడింట రెండొంతుల మధ్య అనుకూలంగా ఓటేస్తేనే తీర్మానానికి ఆమోదముద్రపడుతుంది. రాజ్యసభలో కనీసం 50 మంది, లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యులు తమ సమ్మతి తెలపాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: జడ్జి నోట్ల కట్టల వ్యవహారం.. దాన్ని గోప్యంగానే ఉంచుతాం!

  

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)