Breaking News

ఇండో–పసిఫిక్‌ స్వేచ్ఛా, సుస్థిరతలే లక్ష్యం

Published on Wed, 01/01/2025 - 05:10

న్యూఢిల్లీ: ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దుందుడుకు, విస్తరణవాదానికి కళ్లెం వేస్తూ ఈ ప్రాంత స్వేచ్ఛా, సుస్థిరతలే లక్ష్యంగా ఉమ్మడిగా ముందడుగువేస్తున్నామని క్వాడ్‌ కూటమి దేశాలు పునరు ద్ఘాటించాయి. క్వాడ్‌ కూటమిగా ఆవిర్భవించి పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకోవడం మొదలెట్టి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా క్వాడ్‌ సభ్యదేశాలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశాయి. 2004లో హిందూ మహాసముద్రంలో ఇండోనేసియా సమీపంలో సముద్రగర్భంలో భూకంపం కారణంగా ఉద్భవించిన సునామీ సృష్టించిన విలయం నుంచి కోలుకునేందుకు భార త్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు 20 ఏళ్ల క్రితం ‘క్వాడ్‌’కూటమిగా ఏర్పడిన విషయం విదితమే.

మంగళవారం క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. ఇటీవలికాలంలో ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో తరచూ సముద్రతీర భద్రత, మౌలిక వసతుల కల్పన, దేశాల మధ్య అనుసంధానత పెను సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సంయుక్త ప్రక టన వెలువడటం గమనార్హం. ‘‘ఇండో–పసిఫిక్‌ స్వేచ్ఛాయుతంగా ఉంటే ఇక్కడ సుస్థిరత, పారదర్శకత నెలకొనడంతోపాటు దేశాల మధ్య పరస్పర నమ్మకం, విశ్వాసం ఇనుమడిస్తుంది. పది దేశాలతో ఏర్పడిన ఆసియాన్‌ గురించి క్వాడ్‌ ఆలో చిస్తోంది. తూర్పు ఆసియా దేశాలకు పూర్తి సహాయసహకారాలు అందించడంతోపాటు దేశాల మధ్య ఐక్యతకు క్వాడ్‌ కృషిచేస్తోంది. పసిఫిక్‌ ఐలాండ్స్‌ ఫోరమ్, ఇండియన్‌ ఓషన్‌ రిమ్‌ అసోసియేషన్‌లకూ క్వాడ్‌ తన మద్దతు పలుకుతోంది.

సునామీ వంటి ప్రకృతి విపత్తులు మా నాలుగు దేశాలను దగ్గర చేశాయి. సునామీ వినాశనం వేళ దాదాపు 2.5 లక్షల మంది సజీవ సమాధి అయ్యారు. రాకాసి అలల ధాటికి తీరప్రాంతమున్న 14 దేశాల్లో 17 లక్షల మంది సర్వస్వం కోల్పోయి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. లక్షలాది బాధితులను ఆదుకునేందుకు 40,000కు పైగా అత్యయక బృందాలు అవిశ్రాంతంగా సేవలందించాయి. వినాశనాల వేళ మానవీయ సా యం, విపత్తు స్పందన సహకారం అందించడమే క్వాడ్‌ ముఖ్యోద్దేశం. ఇండో–పసిఫిక్‌లో తలెత్తే ఎలాంటి ఉపద్రవాన్నైనా తక్షణం ఎదుర్కొనేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం.

2021 నుంచి ప్రతి ఏటా క్వాడ్‌ దేశాధినేతలు దక్షిణాసియా, ఆగ్నేయాసియా, పసిఫిక్‌ ప్రాంతాల అభ్యున్నతికి ఎంతగానో కృషిచేశారు’’అని సంయుక్త ప్రకటన పేర్కొంది. 2025 ద్వితీయార్థంలో క్వాడ్‌ సదస్సు భారత్‌లో జరగనుంది. క్రితంసారి అమెరికాలోని విలి్మంగ్టన్‌లో క్వాడ్‌ సదస్సు జరిగింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ దేశాల సార్వ¿ౌమత్వానికి భంగం వాటిల్లకుండా క్వాడ్‌ దేశాలు పనిచేస్తున్నాయని ప్రకటన స్పష్టంచేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)