జమ్మూ కశ్మీర్‌ సీఎం వివాహం రద్దు! 

Published on Sat, 08/01/2026 - 06:02

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా వివాహాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం అధికారికంగా రద్దు చేసింది. ఒమర్‌తోపాటు భార్య పాయల్‌ల వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తూ ‘‘ఇరువురు స్వేచ్ఛను ఎంచుకున్నారు’’ అని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద తమ వివాహాన్ని రద్దు చేయాలని, ఈ మేరకు ఇద్దరూ ఒక అంగీకరానికి వచ్చామని ఒమర్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ చేసిన వాదనలను జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహన్, జస్టిస్‌ అలోక్‌ ఆరాధేలతో కూడిన బెంచ్‌ సుప్రీంకోర్టు అంగీకరించింది.

‘‘ఆర్టికల్‌ 142 కింద దరఖాస్తు ఎప్పుడు నమోదైంది’’అన్న బెంచ్‌ ప్రశ్నకు కపిల్‌ సిబల్‌ ‘‘జూలై 22న’’అని సమాధానమిచ్చారు. పాయల్‌తో తన వివాహం 1994లోనే జరిగినా 2007లో తమిద్దరి మధ్య వైవాహిక సంబంధాలు లేవని ఒమర్‌ అబ్దుల్లా కోర్టుకు గతంలోనే వెల్లడించారు. 2009 నుంచి భార్యభర్తలు ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. 

ఒంటరిని చేయడం, క్రూరత్వాన్ని ప్రదర్శించడం వంటి అంశాల ఆధారంగా పాయల్‌ నుంచి విడాకులు ఇప్పించాలని ఒమర్‌ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే 2016లో ఫ్యామిలీకోర్టు దీన్ని తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఒమర్‌ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. 2023లో ఢిల్లీ హైకోర్టు కూడా ఫ్యామిలీకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పాయల్‌కు నెలకు రూ.1.5 లక్షలు, సంతానం చదువుల కోసం ఒకొక్కరికి నెలకు రూ.60 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఒమర్‌ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. పాయల్‌ తన స్పందనను తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జూలై 22న ఒమర్‌ ఆర్టికల్‌ 142 కింద వివాహాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును అర్థించారు.   

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)