Breaking News

అవును నా ప్రియుడే.. అయితే తప్పేంటి?

Published on Sat, 01/17/2026 - 10:28

వివాహేతర సంబంధాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పలు సందర్భాలు నెట్టింట లేదంటే వార్తల రూపంలో వైరల్‌ అయ్యేది చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో తమ భాగస్వాముల మోసాన్ని.. పరాయి వాళ్లతో ఆ స్థితిలో చూసి భరించలేక దాడులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. ఇక్కడ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధమైన దృశ్యాలు కనిపించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

‘‘హలో.. పోలీస్‌ స్టేషన్‌ ఆ నా భార్య నన్ను మోసం చేస్తోంది. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. మీరు వస్తే వాళ్లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చు’’ అంటూ ఫోన్‌ చేశాడు ఓ భర్త. ఆ కాల్‌ అందుకుని ఆగమేఘాల మీద ఓ హోటల్‌కు చేరుకున్నారు. అప్పటికే పోలీసుల కోసం ఎదురు చూస్తున్న ఆ భర్త.. వాళ్లను చూడగానే ఉరుకుల మీద రూమ్‌ నెంబర్‌ 113 తలుపును విరగొట్టాడు. 

లోపల ఏకాంతంగా గడుపుతున్న ఓ జంట.. ఆ అలజడికి ఉలిక్కి పడింది. వెంటనే మంచం మీద ఉన్న వ్యక్తి.. మంచం కిందకు దూరాడు. ఈలోపు ఆ భర్త గట్టిగా కేకలు వేయడంతో హోటల్‌ సిబ్బంది, రోడ్డు మీద పోతున్న వాళ్లు అక్కడికి చేరారు. మంచం కింద దాక్కున్నవాడ్ని బయటకు లాగారు. వాళ్లందరిరి సమక్షంలో తనని తిట్టిపోస్తున్న భర్తను ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొందామె. 

‘‘అవును.. ఇతను నా ప్రియుడే. నా ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చా. నేను నా భర్త రెండేళ్లుగా దూరంగా ఉంటున్నాం. అందుకే అతనింకా నా జీవితంలో భాగం కాదని ఫిక్స్‌ అయ్యా. అందుకే నాకిష్టమైన వ్యక్తితో జీవించాలని ఫిక్స్‌ అయ్యా. అందుకే నా భర్త నుంచి విడాకులు కోరుతున్నా’’ అంటూ పోలీసులకు సమాధానం ఇచ్చింది. ఈలోపు.. భర్త పోలీసులకు తన వాదన వినిపించడం మొదలుపెట్టాడు. 

పెళ్లైనప్పటి నుంచే తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని.. 2023లో భార్య తరఫు వాళ్లు కేసు పెట్టినా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకున్నామని, కానీ ఆమె మళ్లీ గొడవ పెట్టుకుని వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి మరో వ్యక్తికి దగ్గరైందని.. ఇప్పుడు విడాకుల కోసం రూ.10 లక్షలు డిమాండ్‌ చేస్తోందని వాపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ పోటాపోటీగా వాదించుకోవడంతో పోలీసులు వాళ్లను పీఎస్‌కు తీసుకెళ్లారు. ఇద్దరి వాంగ్మూలాలు తీసుకుని.. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ నగరంలోని నవాబాద్‌ పీఎస్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)