Breaking News

కేసీఆర్ కొత్త పార్టీ.. జేడీఎస్‌ కుమారస్వామి రాక

Published on Tue, 10/04/2022 - 20:59

సాక్షి, హైదరాబాద్‌: దసరా సందర్భంగా టీఆర్‌ఎస్‌ నుంచి జాతీయ పార్టీ ఆవిర్భావ నేపథ్యంలో నగరంలో కోలాహలం నెలకొంది. కేసీఆర్‌ అధ్యక్షతన బుధవారం జరగబోయే పార్టీ జనరల్‌బాడీ మీటింగ్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే.. ఈ మీటింగ్‌ కోసం పలువురు ఇతర రాష్ట్రాల నేతలకు సైతం ఆహ్వానం వెళ్లింది. ఈ క్రమంలో..

జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కుమారస్వామితో పాటు జేడీఎస్‌ కీలక నేత.. మాజీ మంత్రి రేవన్న, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్లు నగరానికి చేరారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కుమారస్వామి బృందానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కేటీఆర్‌  స్వాగతం పలికారు. చీఫ్‌ విప్‌ బాల్క సుమన్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆహ్వానం పలికిన వాళ్లలో ఉన్నారు.

నగరంలోని తెలంగాణ భవన్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్ర‌త్యేక స‌మావేశం జ‌ర‌గ‌నుంది. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు జరగబోయే ఈ పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌లో జేడీఎస్‌ కుమారస్వామి సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

అంతకు ముందు..  త‌మిళ‌నాడుకు చెందిన విడుత్త‌లై చిరుత్తైగ‌ల్ క‌ట్చీ (వీసీకే) అధినేత‌, ఎంపీ తిరుమావ‌ల‌వ‌న్ కూడా నగరానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిలు ఆయనకు స్వాగ‌తం ప‌లికారు.

Videos

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)