సీజీపీ రీఎంట్రీ హెచ్చరిక.. జంతర్‌మంతర్‌ వద్ద హైఅలర్ట్‌

Published on Thu, 07/30/2026 - 10:27

ఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరిగిన నిరసనల్లో నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించకపోతే మరోసారి ఆందోళన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రదర్శనల సమయంలో నిరసనకారులు నిర్ణీత ప్రాంతం దాటి వెళ్లకుండా ఉండేందుకు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన మెటల్ బ్యారికేడ్లను ఇనుప కడ్డీలతో వెల్డింగ్ చేసినట్లు సమాచారం.

భవిష్యత్తులో ఆందోళనలు జరిగితే బ్యారికేడ్లను తొలగించడం లేదా ముందుకు కదలడం సాధ్యం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు, ఇతర భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. సీజీపీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది.

36 రోజుల ఆందోళన.. 
మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజీపీ గతంలో జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం జూలై 25న ఆందోళన విరమించింది. అయితే నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమన్న హామీని కేంద్రం ఉల్లంఘించిందని సీజీపీ ఆరోపించింది. అన్ని ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరోసారి రోడ్డెక్కుతామని హెచ్చరించింది.

సీజీపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా తాజాగా మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిగా ఉల్లంఘించిందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారని, అరెస్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ, అదుపులో ఉన్న నిరసనకారుల విడుదల, కొత్త క్రిమినల్ కేసుల నమోదును నిలిపివేయడం, ఒప్పంద వివరాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారా?
సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే మరో ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల్లో అసంతృప్తి ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు సహాయం చేసేందుకు దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ సెల్ ఏర్పాటు చేసినట్లు సీజీపీ ప్రకటించింది. అలాగే సాక్ష్యాల సేకరణ కోసం ‘సాక్షి’ అనే ఆన్‌లైన్ వేదికను ప్రారంభించింది. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కూడా కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు న్యాయ సహాయం అందించేందుకు రూ.1 కోటి నిధిని ప్రకటించినట్లు సమాచారం.

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)