Breaking News

ఆపరేషన్‌ మహదేవ్‌ పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్‌ హతం

Published on Mon, 07/28/2025 - 13:23

శ్రీనగర్‌: ‘పహల్గాం’ గాయానికి ప్రతీకారం మొదలైంది. దేశమంతటా ఆగ్రహావేశాలు రగిల్చిన ఆ దాడికి పాల్పడ్డ ఉగ్ర ముష్కరులకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. పహల్గాం దాడి సూత్రధారి అయిన ఉగ్ర ముష్కరుడు హషీం మూసా అలియాస్‌ సులేమాన్‌ అలియాస్‌ ఆసిఫ్‌ను భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్‌ శివార్లలోని అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్‌ మహదేవ్‌’ పేరిట జరిపిన భీకర ఎన్‌కౌంటర్‌లో సులేమాన్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఎలైట్‌ పారా కమెండో దళాలు కాల్చిపారేశాయి. వారిని జిబ్రాన్, హంజా అఫ్గానీగా గుర్తించారు. 

జిబ్రాన్‌ గతేడాది సోనామార్గ్‌లో టన్నెల్‌ ప్రాజెక్టు పనులు చేస్తున్న సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముఠా సభ్యుడని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్‌కౌంటర్‌ ప్రాంతం నుంచి ఒక ఎం4 కార్బైన్, రెండు ఏకే రైఫిళ్లు, మందుగుండు, గ్రెనేడ్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నా రు. ముష్కరుల మృత దేహాలను బలగాలు స్థానిక పోలీసులకు అప్పగించాయి. 

ఈ ముష్కరులకు సన్ని హితులైన మరో ఉగ్ర ముఠా సభ్యులు సైతం ఎన్‌కౌంటర్‌ ప్రాంతానికి సమీపంలోనే నక్కినట్టు బలగాలకు సమాచారం అందింది. దాంతో సమీప ప్రాంతాలన్నింటినీ దిగ్బంధించి జల్లెడ పడు తున్నారు. ‘ఆపరేషన్‌ మహదేవ్‌’ ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నట్టు సైనిక, స్థానిక పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఇందుకోసం భారీ సంఖ్యలో అదనపు బలగాలను మోహరించారు. సై న్యం, భద్రతా బలగాలు, కశ్మీర్‌ పోలీసు విభాగ సి బ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నా రు. ఆపరేషన్‌ మహదేవ్‌ ఇప్పట్లో ముగి యబోదని కశ్మీర్‌ జోన్‌ ఐజీ వీకే బిద్రీ స్పష్టం చేశారు..

కునుకు తీస్తుండగానే...
హషీం మూసా. అలియాస్‌ అబూ సులేమాన్‌. అలియాస్‌ ఆసిఫ్‌. పాక్‌ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తయిబా టాప్‌ కమాండర్‌. పహల్గాం ఉగ్ర దాడి సూత్రధారి. ఆపరేషన్‌ మహదేవ్‌లో మన బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు ముష్కరుల్లో అతి ముఖ్యుడు. అయితే ఇంతటి విజయం అంత తేలిగ్గా ఏమీ లభించలేదు. ఇందుకోసం సైన్యం అవిశ్రాంతంగా శ్రమించింది. సీఆర్‌పీఎఫ్, జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌తో కలిసి ఏకంగా 14 రోజుల పాటు కలిసికట్టుగా, నిర్విరామంగా వేట సాగించింది. చివరికి శ్రీనగర్‌ శివార్లలోని అటవీ ప్రాంతంలో మూసా ముఠా ఆనుపానులు కనిపెట్టి ముప్పేట దాడి చేసింది.

 రెప్పపాటులో దాని కథ ముగించింది. జమ్మూ కశ్మీర్‌లోని లిడ్వాస్‌ ప్రాంతంలోని చినార్‌ కార్ప్స్‌ సైనిక విభాగం ఈ ఆపరేషన్‌ను ఆద్యంతం పర్యవేక్షించింది. అనంతరం ఘటనా స్థలిలో తీసిన డ్రోన్‌ ఫుటేజీని విడుదల చేసింది. అందులో ముగ్గురు ముష్కరుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. వీరంతా లష్కరే, పాక్‌కే చెందిన మరో ఉగ్ర ముఠా జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులేనని తేలింది. పహల్గాం ఉగ్ర దాడి తమ పనేనని లష్కరే ప్రకటించుకోవడం తెలిసిందే. ఈ ముగ్గురిలో ముఖ్యుడైన మూసా దాడి సమయంలో తీరిగ్గా కునుకు తీస్తూ ఉండటం ఈ ఉదంతం మొత్తంలో కొసమెరుపు!

అలా ఉచ్చు బిగించారు...
నిజానికి ఆపరేషన్‌ మహదేవ్‌ రెండు రోజులుగా కొనసాగుతోంది. దట్టమైన దాచిగాం అడవుల లోతట్టు ప్రాంతం నుంచి అందని అనుమానాస్పద సిగ్నల్స్, కమ్యూనికేషన్‌తో బలగాలు అప్రమత్తమ య్యాయి. వాటి ఆధారంగానే అనుమానితుల జాడను కనిపెట్టగలిగాయి. ఆ వెంటనే సైనిక బృందాలు, ప్రత్యేక బలగాలు (ఎలైట్‌ ఫోర్సెస్‌) రంగంలోకి దిగి రెండు రోజులుగా పరిసరాలను జల్లెడ పడుతూ వచ్చాయి. ఆ క్రమంలో ఒక చెట్టు కింద తాత్కాలిక గుడారంలో విశ్రమిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను యాదృచ్చికంగా గుర్తించాయి. దాడిని ఏ మాత్రమూ ఊహించని ముష్కరులు టెంట్లో తీరిగ్గా కునుకు తీస్తూ కనిపించారు. సైనికులు వెంటనే తూటాల వర్షం కురిపించి వారిని హత మార్చారు. ఆపరేషన్‌ను పర్యవేక్షించిన అత్యున్నత స్థాయి అధికారి ఒకరు ఈ మేరకు ధ్రువీకరించారు.

రూపం మార్చుకున్న మూసా
ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా దళాలకు చిక్కొద్దనే ఉద్దేశంతో మూసా తన రూపాన్ని వీలైనంతగా మార్చుకున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ క్రమంలో అతడు భారీగా బరువు కోల్పోయాడన్నారు.
 

 

పహల్గాం దాడిలో పాల్గొంది ఈ ఉగ్రవాదులే.. మూసా(కుడివైపు చివర)

అలాగే.. ఈ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు సైన్యం ప్రకటించింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను తెలియజేస్తామని ఎక్స్‌ ద్వారా తెలియజేసింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ములనార్‌, హర్వాన్‌ ప్రాంతాల్లో కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి. మరిన్ని బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నట్లు సమాచారం. 

జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ లో ఎన్‌కౌంటర్

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)