Breaking News

Punjab: హిందూ నేత ఇంటిపై గ్రనేడ్‌ దాడి

Published on Sun, 03/16/2025 - 13:40

జలంధర్‌: పంజాబ్‌(Punjab)లో ఇటీవలి కాలంలో గ్రనేడ్‌ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జలంధర్‌లో హిందూనేత, యూట్యూబర్‌ రోజర్‌ సంఘూ ఇంటిపై గ్రనేడ్‌ దాడి జరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్‌కు చెందిన డాన్‌ షహజాద్‌ ప్రకటన చేశారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నందున రోజర్‌ సంఘూ ఇంటిపై దాడి చేసినట్లు డాన్‌ షహజాద్‌ తెలిపాడు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం హిందూవాదంపై ప్రచారం సాగించే రోజర్‌ సంఘూ ఒక వర్గాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నానే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే అతని ఇంటిపై దాడి  జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో జలంధర్‌ పోలీసులు ఇంకా  ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటనకు ముందు పంజాబ్‌లోని అమృత్‌సర్‌(Amritsar_ జిల్లాలోని ఖండ్వాలా ప్రాంతంలో శనివారం రాత్రి ఠాకుర్‌ద్వార్‌ ఆలయంపై గ్రనేడ్‌ దాడి జరిగింది. మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలయం వెలుపల ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది.

సీసీటీవీ ఫుటేజ్‌ ప్రకారం రాత్రి 12:35 గంటలకు మోటార్‌ సైకిల్‌ ఇద్దరు యువకులు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారి చేతుల్లో జండాలు ఉన్నాయి. కొద్దసేపు వారు ఆలయం ముందు అటుఇటు తిరిగాక, ఆలయంపైకి గ్రనేడ్‌లు విసిరారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలోనే ఆలయంలో నుంచి పెద్ద శబ్ధం వచ్చింది. ఈ సమయంలో ఆలయంలో పూజారి నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే పేలుడు కారణంగా ఆలయంలోని కొంత భాగం ధ్వంసం అయ్యింది. 

ఇది కూడా చదవండి: ర్యాపిడ్‌ రైలు కారిడార్‌పై వర్క్‌ స్పేస్‌.. ప్రయోజనమిదే..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)