Breaking News

కిలో ‘దీపావళి స్వీట్’ రూ.1.11 లక్షలు.. బంగారంతో పోటీ!

Published on Thu, 11/05/2026 - 07:53

జైపూర్‌: దీపావళి పండుగ వేళ స్వీట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ స్వీట్ షాప్‌లో కిలో మిఠాయి ధర రూ.1.11 లక్షలు పలుకుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 24 క్యారెట్ల బంగారం, వెండితో తయారుచేసిన ఈ ప్రత్యేక మిఠాయిలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జైపూర్‌లోని వైశాలీ నగర్‌లో ఉన్న 'త్యోహార్' స్వీట్ షాప్ ఈ ఖరీదైన మిఠాయిలను విక్రయిస్తోంది.

ఇందులో స్వర్ణ మిఠాయి ఒక్కటి ధర రూ.1,111 కాగా, చాందీ భస్మ్ భారత్ ఒక్కటి రూ.1,150గా ఉంది. ఈ ప్రత్యేక స్వీట్ల ధరలు కిలోకు రూ.45 వేల నుంచి రూ.1.11 లక్షల వరకు ఉన్నాయి. ఈ స్వీట్లలో ‘స్వర్ణ భస్మ్ పాక్’ను 24 క్యారెట్ల తినదగిన బంగారంతో తయారుచేస్తున్నారు. ‘చాందీ భస్మ్ పాక్’లో వెండి భస్మాన్ని ఉపయోగిస్తున్నారు. బంగారు మిఠాయిపై బంగారు రేకులతో ప్రత్యేకంగా అలంకరణ చేస్తున్నారు. కుంకుమపువ్వు, ఖరీదైన చిల్గోజా పప్పులను కూడా ఇందులో వినియోగిస్తున్నారు.

ఈ మిఠాయి తయారీ వెనుక చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి వ్యాపారవేత్తగా మారిన అంజలి జైన్ ఉన్నారు. ఆయుర్వేదం, భారతీయ సంప్రదాయ వంటకాలపై ఉన్న ఆసక్తితో ఈ ప్రత్యేక స్వీట్లను రూపొందించినట్లు ఆమె తెలిపారు. వీటిని సాధారణ స్వీట్ల మాదిరిగా కాకుండా ఆభరణాల పెట్టెల్లో  ప్యాక్ చేస్తున్నారు. ఈ స్వీట్‌లో నిజమైన తినదగిన బంగారాన్ని ఉపయోగిస్తున్నట్లు అంజలి వెల్లడించారు. దీనినే ‘స్వర్ణ భస్మం’ అని పిలుస్తారని తెలిపారు. జైన ఆలయం నుంచి సేకరించిన బంగారు రేకులను స్వీట్‌పై ఉపయోగిస్తున్నామని, అవి జంతువులకు హాని కలిగించని విధంగా తయారైనవని పేర్కొన్నారు. భారతీయ ఆయుర్వేద సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ మిఠాయిలను రూపొందించినట్లు వివరించారు.

ఇదీ చదవండి: ‘గంగాజలాల’పై భారత్ కఠిన వైఖరి.. ‘బంగ్లా’కు కొత్త షరతులు!

#

Tags : 1

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)