Breaking News

రూ. 20 కచోరి తిందామని ఆగితే.. రూ. 20 లక్షలు మాయం!

Published on Wed, 10/28/2026 - 15:15

జైపూర్‌లో ఒక వ్యాపారికి ఊహించని విధంగా భారీ ఎదురు దెబ్బ తగిలింది.  సాయంత్రం పూట ఆకలిగా ఉందని కచోరి తినడానికి వెళ్లి, భారీగా నగదు ఉన్న బ్యాగును  కోల్పోయిన వైనం  అతని నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శంగా నిలిచింది. సోమవారం సాయంత్రం నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అసలు ఏమైంది అంటే...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో, చంపాలాల్ అనే వ్యాపారి కచోరీ తినడానికి తన స్కూటర్‌ను ఆపాడు. కనీస ముందు చూపు లేకుండా నగదు బ్యాగును స్కూటర్ ముందు భాగంలో ఉంచారు. స్కూటర్‌పై కూర్చుని హాయిగా కచోరీ తింటున్నారు. ఇదే అదనుగా భావించి, స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు  కేటుగాళ్లు అక్కడ పెట్టిన 20 లక్షల రూపాయల నగదున్న బ్యాగును ఎత్తుకెళ్లారు. అంతే నిమిషాల్లో అంత డబ్బు మాయమైపోయింది.  

ఇదీ చదవండి: ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్‌ స్పెషాల్టీ ఇదే!

 వెంటనే అప్రమత్తమైన , తన చేతిలో ఉన్న కచోరీని అలాగే పట్టుకుని చంపాలాల్ వారిని వెంబడించారు. స్థానికులు కూడా ఆయనకు తోడయ్యారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే వారిద్దరు తప్పించుకొని ఉడాయించారు. దీనివల్ల ఆ వ్యాపారికి తాను తిన్న కచోరీ ధర కంటే దాదాపు వెయ్యి రెట్లు ఎక్కువ నష్టం వాటిల్లింది. చంపాలాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.  హెల్మెట్లు ధరించి ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి: జిమ్‌ ట్రైనర్‌తో లవ్‌.. భర్తపై హత్యాయత్నం : కట్‌ చేస్తే..!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)