Breaking News

కులు, మనాలీ, సిమ్లా.. ఒకేసారి చూసేందుకు ఐఆర్‌సీటీసీ అద్భుత ప్యాకేజీ!

Published on Sat, 02/24/2024 - 08:57

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు, సిమ్లా, మనాలి  పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడవునా టూరిస్టులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మార్చి ప్రారంభం నుండి కులు, సిమ్లా, మనాలిలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈ మూడు అద్భుత ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. 

తాజాగా ఐఆర్‌సీటీసీ ఒక ట్వీట్‌లో ఈ టూర్‌ ప్యాకేజీ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. ఐఆర్‌సీటీసీ అందించే ఈ టూర్ ప్యాకేజీ 2024, మార్చి 27 నుండి ప్రారంభంకానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన ఈ టూర్ ప్యాకేజీలో హిమాచల్‌లోని ఈ మూడు ‍ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. 

ఈ టూర్‌ ప్యాకేజీలో ప్రయాణించాలనుకుంటే.. ఒకరైతే రూ.67,500, ఇద్దరికైతే రూ.53,470, ముగ్గురికి రూ.51,120 చెల్లించాల్సివుంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌ రిజర్వేషన్‌కు రూ.46,420, బెడ్ లేకుండా అయితే రూ.43,800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లలకు, ఛార్జీగా రూ. 33,820లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)