Breaking News

ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్‌ ఏంటంటే..

Published on Thu, 12/11/2025 - 14:30

సాక్షి,ముంబై: తీవ్ర సంక్షోభం, గందరగోళం మధ్య విమానయాన సంస్థ ఇండిగో బాధిత ప్రయాణికుల స్వల్ప ఊరట నిచ్చింది.  వరుస విమానాల రద్దు, ప్రయాణీకుల ఇక్కట్లు , డీజీసీఏ చీవాట్లు నేపథ్యంలో విమాన రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్‌లను అందించనుంది. ఈ మేరకు డిసెంబర్ 11 గురువారం ఇండిగో  ఒక  ప్రకటన విడుదల  చేసింది.

డిసెంబర్ 3, 4 మరియు 5 తేదీలలో విమాన అంతరాయాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్‌లను అందిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది.  విమాన ఆలస్యాలు , రద్దుల కారణంగా ప్రయాణికులకు ఎయిర్‌లైన్ చెల్లించాల్సిన వాపసులు, ప్రభుత్వం నిర్దేశించిన పరిహారానికి ఇండిగో ప్రకటించిన ఈ ఆఫర్‌ అదనం. రాబోయే 12 నెలల్లో ఇండిగోతో భవిష్యత్తులో చేసే ఏదైనా ప్రయాణానికి వోచర్‌లను రీడీమ్ చేసుకోవచ్చని  తెలిపింది.

రద్దు చేయబడిన అన్ని విమానాలకు రీఫండ్‌ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు ఇండిగో తెలిపింది. రీఫండ్‌లు ఇప్పుడు కస్టమర్ ఖాతాలో క్రెడిట్‌అయ్యాయనీ, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తున్నామని తెలిపింది.  ట్రావెల్ ప్లాట్‌ఫామ్ భాగస్వాముల ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్ల రీఫండ్‌లు కూడా ప్రారంభమైనట్టు పేర్కొంది. మరోవైపు విమాన టికెట్ల చార్జీల రీఫండ్‌తోపాటు, ప్రస్తుత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, బయలుదేరే సమయం నుండి 24 గంటలలోపు విమానాలు రద్దు చేయబడిన వినియోగదారులకు, విమానం బ్లాక్ సమయం ఆధారంగా ఇండిగో రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు పరిహారాన్ని అందిస్తుంది. 

ఇదీ చదవండి: రూ. 9.1 కోట్లు ఉంటే ట్రంప్‌ గోల్డ్‌ కార్డ్‌ మీదే! ఎలా అప్లయ్‌ చేయాలి?

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు