రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
ఆపరేషన్ సిందూర్ న్యూ వీడియో షేర్..!
Published on Sun, 05/18/2025 - 19:08
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లోని ఉగ్రమూకల్ని అంతమొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి మరో వీడియోను షేర్ చేసింది ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిన భారత ఆర్మీ.. పాక్ లోని పలు ఎయిర్ బేస్ లను కూడా ధ్వంసం చేసింది. తొలుత ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపట్టింది. దీనికి బదులుగా పాక్ లో ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసి సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.
దీనికి సంబంధించి ఒక్కో వీడియోను భారత ఆర్మీ షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో వీడియోను భారత ఆర్మీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది పహల్గామ్ లో సృష్టించిన మారణహోమానికి జరిగిన న్యాయం మాత్రమే ఇది.. ప్రతీకారం కాదు’ అని పేర్కొంది. ఈ వీడియోకు ఓ క్యాప్షన్ ను జోడించింది. ‘ప్రణాళిక.. శిక్షణ.. అమలు’ అంటూ ట్యాగ్ చేసింది భారత ఆర్మీ.
#StrongAndCapable#OpSindoor
Planned, trained & executed.
Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon— Western Command - Indian Army (@westerncomd_IA) May 18, 2025
Tags : 1