Breaking News

సుదర్శన చక్రతో శత్రు నాశనం

Published on Sat, 11/29/2025 - 04:13

ఉడుపి/యశవంతపుర: దేశ రక్షణ పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ప్రజలంతా ప్రత్యక్షంగా చూశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఎర్రకోట నుంచి శ్రీకృష్ణుడి సందేశాన్ని వినిపించామని తెలిపారు. శత్రువులను నాశనం చేయడానికి ‘మిషన్‌ సుదర్శన చక్ర’ను ప్రకటించామని గుర్తుచేశారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కీలకమైన ప్రాంతాలు, పారిశ్రామికవాడలకు బలమైన రక్షణ కవచం ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.

ప్రధాని మోదీ శుక్రవారం కర్ణాటకలోని ఉడుపి పట్టణంలో పర్యటించారు. ఉడుపి శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో ‘లక్ష కంఠ గీతా పారాయణం’లో పాల్గొన్నారు. లక్ష మందికిపైగా భక్తులతో కలిసి భగవద్గీత పారాయణం చేశారు. 18 శ్లోకాలను పఠించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

మన దేశంలో గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు నిశ్శబ్దంగా ఉండిపోయాయని, ప్రతిదాడులు చేయడానికి సంకోచించాయని ఆక్షేపించారు. కానీ, ఇప్పటి నవ భారతదేశం ఒత్తిళ్లు, బెదిరింపులు, దాడులకు ఎంతమాత్రం లొంగబోదని తేల్చిచెప్పారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం ఎంతదూరమైనా వెళ్తుందని ఉద్ఘాటించారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు  వ్యాఖ్యానించారు.  

పథకాలకు భగవద్గీత బోధనలే పునాది  
‘‘శాంతి, సత్యం కోసం ఎల్లప్పుడూ కృషి చేయాలని భగవద్గీత బోధిస్తోంది. అదేసమయంలో దుషు్టలు, దుర్మార్గులను అంతం చేయాలని చెబుతోంది. వసుధైక కుటుంబం అనే సూత్రాన్ని విశ్వసిస్తున్నాం. ధర్మో రక్షిత రక్షితః అని పఠిస్తున్నాం. పహల్గాంలో మన పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులపై యుద్ధం చేశాం. వారికి తగిన గుణపాఠం నేర్పించాం. మన నిత్య జీవితంలో భగవద్గీత పాత్ర ఎంతో ఉంది. గీత బోధనలు ప్రతి తరానికీ వర్తిస్తాయి. 

దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం జాతీయ విధానాల రూపకల్పనలో భగవద్గీత దిశానిర్దేశం చేస్తూనే ఉంది. జనం బాగు కోసం పనిచేయాలని గీతలో శ్రీకృష్ణుడు పిలుపునిచ్చాడు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌.. సర్వజన హితాయ నినాదాలకు భగవద్గీత శ్లోకాలే స్ఫూర్తి. ఆయుష్మాన్‌ భారత్, పీఎం ఆవాస్‌ యోజన వంటి ప్రజా సంక్షేమ పథకాలకు పునాది భగవద్గీత బోధనలే. భగవద్గీత చూపిన మార్గంలో నడుస్తూ మహిళల భద్రత, సాధికారత కోసం నారీశక్తి వందన్‌ అధినియం తీసుకొచ్చాం’’ అని ప్రధాని మోదీ వివరించారు.  

శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు  
ఉడుపి పట్టణంలో ప్రధాని మోదీ తొలుత రోడ్డుషోలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేశారు. తనపై చల్లిన పూలను తిరిగి జనంపై చల్లారు. అనంతరం శ్రీకృష్ణుడి ఆలయానికి చేరుకున్నారు. పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ ఆధ్వర్యంలో మోదీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తర్వాత ఆలయ ఆచారం ప్రకారం కిటికీ(కనకన కిండీ) నుంచి శ్రీకృష్ణుడి మూలమూర్తిని ప్రధానమంత్రి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మోదీకి వెండి దారంతో కూడిన తులసి జపమాల, శంకు, చక్ర, గద, పద్మం ముద్రలను బహూకరించారు. మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామి ప్రధాని మోదీకి ‘భారత భాగ్య విధాత’ బిరుదునిచ్చి సన్మానించారు. కాశీ కారిడార్‌ తరహాలో ఉడుపి కారిడార్‌ను అభివృద్ధి చేయాలని మోదీని కోరారు.   

కనకదాసకు నివాళులు   
ఉడుపిలోని చరిత్రాత్మక కనక మండపాన్ని  మోదీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 14వ శతాబ్దానికి చెందిన తత్వవేత్త, కీర్తనకారుడు కనకదాసకు ఘనంగా నివాళులరి్పంచారు. ఉడుపిలో శ్రీకృష్ణుడు పశి్చమ ముఖంగా కొలువుదీరడం వెనుక కనకదాస పాత్ర ఉందని భక్తులు విశ్వసిస్తారు. మోదీ ఉడుపి ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. 2008 ఏడాదిలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఈ ఆలయానికి వచ్చారు.  

తొమ్మిది ప్రతిజ్ఞలు  
వికసిత్‌ భారత్, నవ్య భారత్‌ కోసం తొమ్మిది ప్రతిజ్ఞలు చేయాలని ప్రధాని మోదీ ఉడుపి శ్రీకృష్ణుడి ఆలయం నుంచి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అవి ఏమిటంటే..  
→ మాతృమూర్తి పేరిట ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. 
→ నదులు, చెరువులు, ఇతర జల వనరులను కాపాడుకోవాలి. జల సంరక్షణే మన ధ్యేయం కావాలి.   
→ కనీసం ఒక నిరుపేద జీవితాన్ని మెరుగుపర్చడానికి కృషి చేయాలి. 
→ బాధ్యత కలిగిన దేశ పౌరులుగా స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలి. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ అనేది మన నినాదం కావాలి. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ సాధనకు తోడ్పాటునందించాలి.  

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)