Breaking News

మోదీ సర్కార్‌ మెగా డిఫెన్స్‌ ప్లాన్‌ రెడీ

Published on Fri, 09/05/2025 - 16:42

ఢిల్లీ: మోదీ సర్కార్‌ 15 ఏళ్ల ప్రణాళికను ఆవిష్కరించింది. సైనిక దళాల ఆధునికీకరణకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ మెగా డిఫెన్స్‌ ప్లాన్‌ రూపొందించింది. న్యూక్లియర్‌ వార్‌ షిప్స్‌, హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్‌, లేజర్‌, రోబోటిక్స్‌, ఏఐ ఆయుధాలతో భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. నౌక దళం కోసం సరికొత్త ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం మోదీ ప్రభుత్వం అతిపెద్ద రక్షణ అభివృద్ధి ప్రణాళికను ప్రకటించింది. దీని ద్వారా భారత సాయుధ దళాలను బిలియన్ల డాలర్ల పెట్టుబడితో అత్యాధునిక సాంకేతికతతో ఆధునీకరించనున్నారు. ఈ రోడ్‌ మ్యాప్ ప్రకారం, భారత్ తన ఆయుధాగారంలోకి అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, నెక్ట్స్‌ జనరేషన్‌ యుద్ధ ట్యాంకులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, AI- ఆధారిత ఆయుధాలు, అంతరిక్ష ఆధారిత యుద్ధ సాంకేతికతను చేర్చనుంది.

భారత సైన్యం.. టి-72 యుద్ధ ట్యాంకులకు బదులుగా దాదాపు 1,800 అత్యాధునిక ట్యాంకులను, పర్వత ప్రాంత యుద్ధం కోసం 400 తేలికపాటి ట్యాంకులను, 50,000 ట్యాంకులకు అమర్చే యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను, 700 రోబోటిక్ కౌంటర్-IED వ్యవస్థలను చేర్చుకోనుంది.

నౌకా దళం ఒక కొత్త విమాన వాహక నౌక, 10 అధునాతన యుద్ధ నౌకలు, 7 ఆధునిక కార్వెట్‌లు, 4 ల్యాండింగ్ డాక్ ప్లాట్‌ఫారమ్‌లను పొందనుంది. యుద్ధ నౌకల కోసం అణు చోదక వ్యవస్థ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్‌లకు కూడా ఆమోదం లభించింది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)