Breaking News

జైశంకర్‌ ఇంటర్వ్యూ.. మీడియా సంస్థపై కెనడా నిషేధం

Published on Thu, 11/07/2024 - 20:01

ఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌లతో కలిసి ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే..  ఈ ఇంటర్వ్యూ విషయంలో కెనడా మరోసారి దూకుడుగా వ్యవహరించింది. ఇంటర్య్వూ ప్రసారం చేసిన.. ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్స్ , ఆస్ట్రేలియన్ న్యూస్ అవుట్‌లెట్ పేజీలు బ్లాక్ చేసింది. 

అక్కడితో ఆగకుండా కొన్ని గంటల్లోనే సదరు మీడియా సంస్థపై  కెనడా నిషేధం విధించింది. దీంతో కెనడా వ్యహరించిన తీరుపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఇటువంటి చర్యలు వాక్ స్వాతంత్రాన్ని కెనడా వంచిస్తోందని మండిపడింది. కెనడాలో ఆస్ట్రేలియా టుడే సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను బ్లాక్ చేయటంపై  భారత్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. 

‘‘ఆస్ట్రేలియా టుడే మీడియా అవుట్‌లెట్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పేజీలు బ్లాక్ చేయబడ్డాయి. కెనడాలోని వీక్షకులకు అవి అందుబాటులో లేవు. కేంద్ర మంత్రి ఎస్‌. జైశంకర్‌.. పెన్నీ వాంగ్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కొన్ని గంటల తర్వాత జరిగింది. కెనడా తీరుపై మేం ఆశ్చర్యపోయాం. చాలా వింతగా అనిపించింది. అయితే, ఇవి కెనడా కపటత్వాన్ని మరోసారి ఎత్తి చూపే చర్యలు. 

..వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించి విదేశాంగ మంత్రి మూడు విషయాల గురించి మాట్లాడారు. కెనడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోంది. భారత దౌత్యవేత్తలపై నిఘా కెనాడా నిఘా పెట్టడం ఆమోదయోగ్యం కాదు. కెనడాలో వేర్పాటువాదులకు రాజకీయంగా చోటు ఇస్తోంది. భారతదేశ అంశాలు మాట్లాడితే.. ఆస్ట్రేలియా టుడే ఛానెల్‌ను కెనడా ఎందుకు బ్లాక్ చేసింది’’ అని అన్నారు.

చదవండి: ‘ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం.. భారత్‌కు అనుకూలం’
 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)