Breaking News

చమురు కొనుగోళ్లకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాం 

Published on Fri, 10/31/2025 - 01:37

న్యూఢిల్లీ: రష్యన్‌ చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్‌ తన ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు మరిన్ని కొత్త మార్గాలను అన్వేíషింంచనుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్‌ జైస్వాల్‌ గురువారం ప్రకటించారు. రష్యాలో ప్రభుత్వరంగ అతిపెద్ద చమురు సంస్థ రోస్‌నెఫ్ట్‌తోపాటు అక్కడి అతిపెద్ద ప్రైవేట్‌ చమురు సంస్థ లక్‌ఆయిల్‌లపై ఆంక్షల కొరడా ఝలిపించామని దక్షిణకొరియాలో ట్రంప్‌ ప్రకటించిన మరుసటి రోజే భారత్‌ స్పందించడం గమనార్హం.

 అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ ఈ సంస్థల నుంచి తక్కువ ధరకు చమురుకొనే బదులు ఇదే రేట్లకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయగల అవకాశాలను భారత్‌ పరిశీలిస్తోంది. రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకుంటూ అమెరికా పెట్రోలియం ఉత్పత్తులను భారత్‌ దిగుమతి చేసుకోబోందన్న వార్తల నడుమ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌«దీర్‌ జైస్వాల్‌ స్పందించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్‌ ఇంకా చర్చలు జరుపుతోందని గుర్తుచేశారు. అయితే గత నెలలతో పోలిస్తే తాజాగా రష్యన్‌ సంస్థల నుంచి భారత చమురు కొనుగోళ్లు తగ్గినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 

ఛాబహార్‌ పోర్ట్‌ విషయంలో ఊరట 
ఇరాన్‌లోని కీలక ఛాబహార్‌ ఓడరేవు నుంచి అంతర్జాతీయ నౌకల రాకపోకలపై అమెరికా విధించిన ఆంక్షలను భారత్‌ కోసం కొద్దికాలం పక్కనబెట్టింది. ఆరు నెలలపాటు ఆంక్షల నుంచి భారత్‌ను మినహాయింపునిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మినహాయింపు అక్టోబర్‌ 29వ తేదీ నుంచి మొదలవుతుందని జైస్వాల్‌ చెప్పారు. అంతర్జాతీయంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో తనకు ప్రతికూలంగా మారొద్దనే అక్కసుతో అమెరికా ఈ ఓడరేవుపై సెప్టెంబర్‌ 29వ తేదీ నుంచి ఆంక్షలు విధించడం తెల్సిందే. అయితే భారత అభ్యర్థనతో ఆ ఆంక్షల అమలును నెలరోజులు వాయిదా వేశారు. తాజా చర్చలతో దానిని మరో ఆరునెలలు పొడిగించారు. ఛాబహర్‌ పోర్ట్‌ను అనుసంధానత, సత్సంబంధాలే లక్ష్యంగా భారత్, ఇరాన్‌ సంయుక్తంగా అభివృద్ధిచేశాయి.   
 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)