Breaking News

ఇండియా కూటమి ఎన్నికల భేరి

Published on Mon, 03/04/2024 - 05:59

పట్నా: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బిహార్‌ రాజధాని పట్నా వేదికగా ఎన్నికల ప్రచార నగారా మోగించారు. ఆర్‌జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సారథ్యంలో ఆదివారం జరిగిన ‘జన్‌ విశ్వాస్‌ మహా ర్యాలీ’లో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తదిపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ..రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గరిష్టంగా సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలపై  ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను ఉసి గొల్పుతూ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వాటిని చూసి తాము భయపడటం లేదని చెప్పారు. దేశ సంపదను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

అనంతరం రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ.. కేవలం ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలను కాపాడుతున్న మోదీ ప్రభుత్వం, దేశ జనాభాలో 73 శాతం మేర ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా బిహార్‌ మాజీ సీఎం, ఆర్‌జేడీ చీఫ్‌ లాలూ యాదవ్‌ ప్రసంగిస్తూ.. ఇటీవల తమను వదిలేసి ఎన్‌డీఏ పక్షంలో చేరిన సీఎం నితీశ్‌పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేలా మీలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు నేను ఇక్కడే ఉంటాను’అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ..యూపీ, బిహార్‌లలో కలిపి 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తే కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, దీపాంకర్‌ భట్టాచార్య కూడా ర్యాలీలో ప్రసంగించారు.

రైల్వేపై రాహుల్‌ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం ధనికులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రైల్వే విధానాలను రూపొందిస్తోందని రాహుల్‌ ఆరోపించారు. ప్రధాని మోదీని నమ్మితే నమ్మక ద్రోహం గ్యారెంటీ అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘డైనమిక్‌ ఫేర్‌ పేరుతో ఏటా 10 శాతం చొప్పున రైలు చార్జీలను ప్రభుత్వం పెంచుతోంది. క్యాన్సిలేషన్‌ చార్జీలను, ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరలను సైతం పెంచింది’’ అని విమర్శించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)