Breaking News

ఇండియా కూటమి కీలక నిర్ణయం

Published on Wed, 06/05/2024 - 20:50

న్యూఢిల్లీ:  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున  ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ ముగిసింది. మిత్రపక్షాలతో కలిసి సుధీర్ఘ చర్చలు జరిపిన అనంతరం.. ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి తీర్మానం చేసుకుంది. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఇండియా భాగస్వామ్యం ఏకతాటిపై పోరాటం చేస్తాయని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్షానికి మద్దతిచ్చిన దేశ ప్రజలందరికీ కూటమి తరపున ధన్యవాదాలు తెలిపారు.

లోక్‌సభ ఫలితాల అనంతరం ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక, తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం చంపై సోరెన్‌ అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, డీ రాజా, ఏచూరి హాజరయ్యారు. 

ఇండియా కూటమి సంయుక్త ప్రకటన

  • నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం
  • బీజేపీని గద్దె దింపేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాం

ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయి. నైతికంగా ప్రధాని ఓడిపోయారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా పోరాడింది. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావొచ్చు. ఈ ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. మోదీ ప్రజల అభీష్టాన్ని మార్చాలని చూస్తున్నారు. 

 :::ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

 

ప్రతిపక్ష నేతలంతా కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగ‌ర్(272) దాట‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన క‌స‌రత్తు లేదా ప్రతిపక్ష హోదా కొనసాగింపు వంటి వివిధ అంశాలపై లోతుగా చర్చించారు. చివరికి ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి నిర్ణయించింది.

కాగా జూన్‌ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి 291, ఇండియా కూటమికి 232 స్థానాలు దక్కాయి.  బీజేపీ స్వతహాగా 240 సీట్లు గెలుచుకుంది. అయితే ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో ప్రధాని మోదీ ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతికి సమర్పించారు. జేడీయూ, టీడీపీ వంటి మిత్ర పక్షాలతో కలిసి జూన్‌ 8న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)