Breaking News

ఇండియా సాయం కోరిన పాక్‌.. భారత్‌ గ్రీన్‌సిగ్నల్‌

Published on Tue, 12/02/2025 - 07:39

ఢిల్లీ: శ్రీలంకకు సాయం చేసే విషయంలో దాయాది దేశం పాకిస్తాన్‌ మీడియా తప్పుడు ప్రచారాన్ని భారత్‌ ఖండించింది. దిత్వా తుపాను కారణంగా దెబ్బతిన్న శ్రీలంకకు సాయం చేసేందుకు గగనతల అనుమతి కోరినప్పటికీ.. భారత్‌ అనుమతించలేదని పాక్‌ మీడియా ఫేక్‌ ప్రచారం​ చేసింది. అయితే, ఇది అసత్య ప్రచారమని భారత్‌ క్లారిటీ ఇచ్చింది.

వివరాల ప్రకారం.. దిత్వా తుపాను నేపథ్యంలో శ్రీలంకకు సాయం చేయడానికి పాక్‌.. భారత​ గగనతలం నుంచి ప్రయాణించేందుకు సాయం కోరింది. సోమవారం భారత్‌ను సంప్రదించింది. అనంతరం, తమకు భారత్‌ అనుమతి ఇవ్వలేదని పాక్‌ మీడియా తప్పుడు ప్రచారం అందుకుంది. ఈ నేపథ్యంలో పాక్‌ మీడియా ప్రచారాన్ని భారత్‌ ఖండించింది. ఈ సందర్బంగా భారత్‌.. మన గగనతలంలో ప్రయాణించేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పాక్‌ సంప్రదించిందని, సాయంత్రం 5.30 గంటలకు భారత్‌ అనుమతి ఇచ్చిందని, అధికారిక ఛానల్‌ ద్వారా ఈ సమాచారం చేరవేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మానవతా దృక్పథంతోనే అనుమతులు ఇచ్చినట్లు భారత్‌ స్పష్టం చేసింది. ఇది అసత్య ప్రచారమని భారత అధికారులు పేర్కొన్నారు. ఇది తప్పుదారి పట్టించే వార్తలు అని తెలిపారు.

ఇదే సమయంలో గగనతల సంబంధిత నిర్ణయాలకు సంబంధించి భారత్‌ ప్రామాణిక కార్యచరణ, సాంకేతిక, భద్రతా అంచనాలను పరిగణనలోకి తీసుకుంటుందని, రాజకీయ కోణంలో అనుమతుల నిరాకరణ ఉండదని అధికారులు పేర్కొన్నారు. పాక్‌ విమానాలు భారత గగనతలం మీదుగా ప్రయాణించేందుకు వీలు లేనప్పటికీ పూర్తి మానవతా కోణంలో ఆలోచించి అనుమతులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పాక్‌ మీడియా నివేదికలు పూర్తిగా తప్పుఅని, బాధ్యత రాహిత్యమైనవని అధికారులు వివరించారు. 

ఇదిలా ఉండగా.. దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే, వరద నీటిలో పలువురు గల్లంతయ్యారు. ఇటీవలి కాలంలో శ్రీలంకలో ఇంతటి పెను ముప్పు రాలేదని అధికారులు చెబుతున్నారు. దిత్వా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)