Breaking News

కేంద్రంపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ

Published on Thu, 06/04/2026 - 04:39

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, కూటమిలో నెలకొన్న అభిప్రాయ భేదాల నేపథ్యంలో మరోమరు విపక్షాల ఐక్యత చాటేందుకు, కేంద్ర ప్రభుత్వంపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేందుకు విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు 8వ తేదీన హస్తినలో భేటీకానున్నాయి. 

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సహా తృణముల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్, శివసేన(యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సహా మొత్తం 15 పార్టీల అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం, ప్రతిపక్ష ఐక్యతను మరింత బలోపేతం చేయడం భేటీ ప్రధాన లక్ష్యాలుగా తెలుస్తోంది. 

ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, నిరుద్యోగం, ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, అంతర్జాతీయ పరిస్థితులు వంటి ప్రజా సమస్యలపై సంయుక్త పోరాటానికి భేటీలో వ్యూహాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర పరిణామాలు, వివిధ రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. అయితే ‘ఇండియా’ కూటమిలోని కొన్ని పార్టీల మధ్య ఇటీవల అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. 

ముఖ్యంగా రానున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు వార్తలు రావడం కూటమిలో గందరోగళం నెలకొంది. ‘ఇండియా’ కూటమితో తెగదెంపులు చేసుకున్న ఆప్‌ పార్టీ ప్రతి పక్షాల కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. తమిళనాడు ఎన్నికల అనంతరం పరిణాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో తన బంధాన్ని తెంచుకుంటున్నట్లు డీఎంకే ప్రకటించింది. 

తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు తెగిపోయిన నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీలకు దూరంగా కూర్చోవాలని డీఎంకే నిర్ణయించింది. డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి కొద్ది రోజుల కిందటే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి తమ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో డీఎంకే సమావేశానికి దూరంగా ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో డీఎంకే స్థానంలో విజయ్‌ జోసెఫ్‌ సారథ్యంలోని టీవీకే పార్టీకి ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)